- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Sama Rammohan Reddy : నీ నీడ కూడా నీ మీద ఉమ్మేస్తది : కేటీఆర్ పై కాంగ్రెస్ నేత సామ ఫైర్
దిశ, వెబ్ డెస్క్ : ఎమెల్యే బదులు అధికార కార్యక్రమాలలో పాల్గొనడానికి సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)s సోదరుడు(Brother) తిరుపతి రెడ్డి(Tirupati Reddy)ఎవరంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) చేసిన విమర్శలకు కాంగ్రెస్ పార్టీ మీడియా సెల్ చైర్మన్ (Congress Party Media Cell Chairman)సామ రామ్మోహన్ రెడ్డి(Sama Rammohan Reddy) ఎక్స్ వేదికగా కౌంటర్ వేశారు. సిగ్గుందా సైకో రామ్?? నువ్వు కుటుంబ పాలన గురించి మాట్లాడుతున్నావా ?? అంటూ రామ్మోహన్ రెడ్డి కేటీఆర్ పై మండిపడ్డారు. కుటుంబ పాలన వ్యాఖ్యలకి నువ్వు అద్దం ముందు చూస్తే..నీ నీడ కూడా నీ మీద ఉమ్మేస్తదంటూ ఎద్దేవా చేశారు. ఏ పదవీ లేనప్పుడు మీ అయ్యకి టాబ్లెట్లు, టాయిలెట్ పేపర్లు అందించే సంతోష్ కుమార్ కు 1+1 సెక్యూరిటీ ఎవడు ఇచ్చిండని కేటీఆర్ ను ప్రశ్నించారు. రాజ్యసభ ఎంపీకి ఐఎస్ డబ్ల్యు(ISW) ప్రోటోకాల్ కాకపోయినా 2+2 సెక్యూరిటీ ఎవడు పెట్టిండని నిలదీశారు.
మీలాగా అధికారంలో ఉన్నప్పుడు కుటుంబమంతా ఎంపీలుగా, ఎమ్మెల్సీలుగా, మంత్రులుగా నియమించుకోలేదు..రేవంత్ రెడ్డి కుటుంబమని గుర్తు చేశారు. మీ కుటుంబంలాగా రాష్ట్రంలోని జిల్లాలను ఆస్తుల్లా పంచుకోలేదు వాళ్ళని, మీలాగా కుటుంబమంతా దోపిడీ దొంగల్లాగ రాష్ట్రాన్ని కొల్లగొట్టలేదు వాళ్ళు అని కేటీఆర్ విమర్శలను రామ్మోహన్ రెడ్డి తిప్పికొట్టారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రజలకు సంక్షేమాన్ని పంచడంలో పాల్గొంటున్నారని...మీ కుటుంబం లాగ అయ్య కాళేశ్వరం, బావ కాకతీయ, చెల్లె లిక్కర్, తమ్ముడు మొక్కలు, నువ్వు ఏ టూ జడ్ చేసిన కుంభకోణాల మాదిరి కాదని కేటీఆర్ పై రామ్మోహన్ రెడ్డి ఘాటు విమర్శలు గుప్పించారు.