- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
రైల్వేల ఆధునికీకరణతో దేశ ముఖచిత్రం మారిపోతుంది: ప్రధాని మోడీ
దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్ మహానగరంలో పెరుగుతున్న ట్రాఫిక్, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో రోజు రోజుకు పెరిగిపోతున్న రద్దీని దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం(Central Govt) చర్లపల్లి రైల్వే టెర్మినల్ (Charlapally Railway Terminal)ను అభివృద్ధి చేసింది. ఈ క్రమంలో రూ. 413 కోట్లతో ఎయిర్ పోర్టును తలపించేలా మొత్తం 9 ఫ్లాట్ ఫామ్‌లతో ఈ టెర్మినల్‌ను నిర్మించారు. కాగా కాగా దీనిని భారత ప్రధాని(Prime Minister of India) నరేంద్ర మోడీ(Narendra Modi) ఈ రోజు మధ్యాహ్నం వర్చువల్ గా ప్రారంభించారు(Started virtually). అనంతరం ప్రధాని మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం దేశంలో కనెక్టివిటీ అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని, మెట్రో నెట్ వర్క్ 1000 కిమి కు పైగా విస్తరించిందన్నారు. అలాగే జమ్ముకశ్మీర్, ఒడిశా, తెలంగాణలో కొత్త కనెక్టివిటీకి ఏర్పాటు జరిగాయని.. ఒక్కో అడుగు వేసుకుంటే దేశంలో కొత్త పుంతలు తొక్కిస్తున్నామని, ఈ క్రమంలో రైల్వే ఆధునికీకరణకు ప్రధాన్యం ఇస్తున్నామని ప్రధాని మోడీ చెప్పుకొచ్చారు.
ఇందులో భాగంగా రైల్వే రంగంలో మౌలిక సదుపాయాలకు పెద్ద పీట వేస్తూ.. ముందుకు సాగుతున్నామని, దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాలకు కనెక్టివిటీ పెంచేలా కృషి చేస్తున్నామని ప్రధాని మోడీ చెప్పుకొచ్చారు. అలాగే దేశంలోని అనేక ప్రాంతాల్లో హై స్పీడ్ రైళ్ల ఏర్పాటుకు డిమాండ్ పెరుగుతుందని, ప్రాధాన్యత ఆధారంగా ఒక్కోక్కటి నిర్మిస్తూ వస్తున్నామని అన్నారు. దేశంలో ఇప్పటికే 35 శాతం విద్యుదీకరణ పూర్తి అయిందని గుర్తు చేశారు. అలాగే తాము అధికారంలోకి వచ్చిన తర్వాత భారత్ లో తయారైన వందేభారత్, అమృత్ భారత్, నమో భారత్ రైళ్లు తీసుకొచ్చామని, వందే భారత్ ఎక్స్ ప్రెస్ లో స్లీపర్ వంటి సౌకర్యాలు కూడా అందుబాటులోకి తీసుకొచ్చామని, దశాబ్ద కాలంలో భారతీయ రైల్వే కొత్త రూపు సంతరించుకుందని అన్నారు. అత్యంత వేగంగా జరుగుతున్న రైల్వేల ఆధునికీకరణతో దేశ ముఖచిత్రం మారిపోతుందని ప్రధాని మోడీ(Prime Minister Modi) ఆశాభావం వ్యక్తం చేశారు.