KTR: గ్రీన్ కో ఎన్నికల బాండ్ల ఇష్యూ.. కేటీఆర్ రియాక్షన్ ఇదే!

by Shiva |
KTR: గ్రీన్ కో ఎన్నికల బాండ్ల ఇష్యూ.. కేటీఆర్ రియాక్షన్ ఇదే!
X

దిశ, వెబ్‌డెస్క్: ఫార్ములా ఈ-రేస్ కేసు (Formula E-Race Case) రాష్ట్ర రాజకీయాలను షేక్ చేస్తోంది. ఇటీవల ఏసీబీ (ACB) అధికారుల నోటీసులు అందుకున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఇవాళ విచారణకు హాజరయ్యారు. అయితే, విచారణలో భాగంగా తన వెంట వచ్చిన లాయర్లను లోనికి అనుమతించకపోవడంతో కేటీఆర్ తీవ్ర అభ్యతరం వ్యక్తం చేస్తూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ పరిణామాల నేపథ్యంలోనే ఫార్ములా ఈ-రేసు కేసు వ్యవహారంపై ప్రభుత్వం సంచలన ఆరోపణలు చేసింది. రాష్ట్రంలో ఫార్ములా ఈ-రేసు నిర్వహించిన గ్రీన్ కో కంపెనీ (Green Co Company) నుంచి ఆనాడు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ (BRS Party)కి ఎన్నికల బాండ్ల (Election Bonds) రూపంలో రూ.కోట్లు లబ్ధి చేకూరినట్లుగా ఆరోపించింది. గ్రీన్ కో (Green Co), దాని అనుబంధ సంస్థ నుంచి 41 సార్లు బీఆర్ఎస్ పార్టీకి 2022 ఏప్రిల్ 20 నుంచి అక్టోబర్ 10 మధ్య బాండ్లు కొనుగోలు చేశారని పేర్కొన్నారు. ప్రతిసారి రూ.కోటి చొప్పున మొత్తం 41 కోట్లను బాండ్ల రూపంలో బీఆర్ఎస్ (BRS) చెల్లింపులు జరిగాయని ప్రభుత్వం ఆరోపణలు గుప్పించింది.

కాగా, సర్కార్ చేసిన ఆరోపణలపై తాజాగా కేటీఆర్ (KTR) స్పందించారు. గ్రీన్ కో 2022లో ఎన్నికల బాండ్లు ఇచ్చిన మాట వాస్తవమేనని అన్నారు. కానీ, హైదరాబాద్ (Hyderabad) వేదికగా ఫార్ములా ఈ-రేస్ జరిగింది 2023లో అని క్లారిటీ ఇచ్చారు. రాష్ట్రంలో కాంగ్రెస్ (Congress), బీజేపీ (BJP)లకు కూడా గ్రీన్ కో బాండ్లు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. ఫార్ములా ఈ-రేసు కారణంగా గ్రీన్ కో, దాని అనుబంధ సంస్థ చాలా నష్టపోయాయని తెలిపారు. పార్లమెంట్ ఆమోదించాక ఎన్నికల బాండ్లు అవినీతి ఎలా అవుతాయని ప్రశ్నించారు. మరి దేశ వ్యాప్తంగా అన్ని పార్టీలకు ఇచ్చిన బాండ్లపై ప్రభుత్వం చర్చకు సిద్ధంగా ఉందా అని కేటీఆర్ ప్రశ్నించారు.

Advertisement

Next Story