- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
‘కోర’ సినిమా టీజర్ రిలీజ్.. క్యూరియాసిటీని పెంచుతున్న అమ్మ సెంటిమెంట్
దిశ, సినిమా: హీరో సునామి కిట్టి, డైరెక్టర్ ఒరాట శ్రీ కాంబోలో వస్తున్న సినిమా ‘కోర’(Kora). అయితే ఈ చిత్రాన్ని శ్రీ లక్ష్మి జ్యోతి క్రియేషన్స్, రత్నమ్మ మూవీస్ బ్యానర్ పై డా. ఏబీ నందిని(AB Nandini), ఎన్ బాలాజీ(N. Balaji), పి మూర్తి(P. Murthy) నిర్మిస్తున్నారు. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ మూవీని కన్నడతో పాటు తెలుగు, హిందీ, తమిళ్, మలయాళ భాషల్లో గ్రాండ్‌గా రిలీజ్ చేయనున్నారు. ఇందులో భాగంగా ఈ మూవీ రిలీజ్ డేట్‌ను త్వరలోనే ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. ఇక ఇప్పటికే ఈ చిత్రం నుంచి వచ్చిన ప్రతి అప్డేట్ ఆకట్టుకోగా.. తాజాగా ఈ సినిమా టీజర్ రిలీజ్ చేశారు. తమిళ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి ‘కోర’ సినిమా టీజర్‌ను సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారు.
ఇక టీజర్‌ను గమనించినట్లయితే.. గూడెం ప్రజలని ఒక విలన్ చాలా ఇబ్బంది పెడుతుంటాడు. అప్పుడు వాళ్లని కాపాడడానికి హీరో వస్తాడు. అలా వచ్చి అతనితో ఫైటింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఈ సినిమాలో అమ్మ సెంటిమెంట్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ టీజర్ సినిమాపై మరింత క్యూరియాసిటీని పెంచేసింది. కాగా ఈ చిత్రంలో చరిష్మా, పి.మూర్తి, M.K మాత, మునిరాజు, నినాసం అశ్వత్ వంటి పలువురు నటీనటులు ముఖ్య పాత్రలు పోషించారు.