Balakrishna: దబిడి దిబిడి సాంగ్‌పై ట్రోల్స్.. స్పందించి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన బాలయ్య (ట్వీట్)

by Hamsa |
Balakrishna: దబిడి దిబిడి సాంగ్‌పై ట్రోల్స్.. స్పందించి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన బాలయ్య (ట్వీట్)
X

దిశ, సినిమా: గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ(Balakrishna), బాబీ కొల్లి కాంబినేషన్‌లో రాబోతున్న తాజా చిత్రం ‘డాకు మహారాజ్’(Daaku Maharaaj). సితార ఎంటర్‌టైన్‌మెంట్స్(Sithara Entertainments) బ్యానర్‌పై సూర్య దేవర నాగవంశీ(Naga Vamsi), సాయి సౌజన్య భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. అయితే ఇందులో ప్రగ్యా జైస్వాల్(Pragya Jaiswal), శ్రద్ధ శ్రీనాథ్(Shraddha Srinath) హీరోయిన్లుగా నటిస్తున్నారు. భారీ అంచనాల మధ్య ‘డాకు మహరాజ్’ సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన అప్డేట్ అన్ని మంచి రెస్పాన్స్‌ను దక్కించుకున్నాయి.

మరీ ముఖ్యంగా ఇటీవల విడుదలైన ‘దబిడి దిబిడి’ సాంగ్ యూట్యూబ్‌ను షేక్ చేస్తూ టాప్ ట్రెండింగ్‌లో కొనసాగుతోంది. అలాగే ట్రోల్స్‌ను కూడా ఎదుర్కొంటుంది. ఇందులో బాలయ్య, ఊర్వశి రౌతేలా(Urvashi Rautela) మాస్ స్టెప్స్ వేసి అందరినీ షాక్‌కు గురి చేశారు. కానీ కొందరు మాత్రం కూతురు వయసున్న నటితో బాలయ్య అలా ప్రవర్తించడమేంటని అంతా దారుణంగా మాట్లాడుతున్నారు. అంతేకాకుండా మీమ్స్ రెడీ చేసి నెట్టింట షేర్ చేస్తున్నారు.

ఈ క్రమంలో.. తాజాగా, ట్రోలింగ్‌పై బాలకృష్ణ X ద్వారా స్పందించి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ‘‘గుంటూరు కరంలో కుర్చీ మడతపెట్టి-hit, పుష్ప లో అల్లు అర్జున్(Allu Arjun), రష్మిక(Rashmika) సాంగ్- hit, డాకు మహారాజ్ డబిడి దిబిడి..Hit, ఈ మూడు సాంగ్స్ రిలీజ్ అయినప్పుడు తిట్టారు ట్రోల్ చేశారు.. ఈ రెండు సినిమాలు హిట్ , ఇప్పుడు డాకు మహారాజ్ కూడా Blockbuster Hit అవుతుంది’’ అని రాసుకొచ్చారు. ప్రస్తుతం బాలయ్య ట్వీట్ వైరల్ అవుతుండగా.. ఆయన అభిమానులు స్ట్రాంగ్‌గా ఇచ్చిపడేశారు అని అంటున్నారు.

Advertisement

Next Story

Most Viewed