- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
తమిళనాడు అసెంబ్లీలో జాతీయ గీతానికి ఘోర అవమానం.. రాజ్ భవన్ ట్వీట్ వైరల్
దిశ, వెబ్ డెస్క్: తమిళనాడు అసెంబ్లీ(Tamil Nadu Assembly)లో మరోసారి జాతీయ గీతానికి అవమానం జరిగినట్లు రాజ్ భవన్ తమిళనాడు(Raj Bhavan Tamil Nadu) ట్వీట్ చేసింది.ఆ ట్వీట్ లో ఇలా రాసుకొచ్చారు. 'భారతదేశ రాజ్యాంగం, జాతీయ గీతం మరోసారి ఈ రోజు తమిళనాడు అసెంబ్లీకి అవమానమైంది. జాతీయ గీతానికి గౌరవం ఇవ్వడం మన రాజ్యాంగంలో పేర్కొన్న తొలి మౌలిక కర్తవ్యం. గవర్నర్ ప్రసంగం ప్రారంభ, ముగింపులో అన్ని రాష్ట్ర శాసనసభలో జాతీయ గీతం పాడుతారు. అయితే, ఈ రోజు గవర్నర్ సభకు చేరుకున్నప్పుడు కేవలం 'తమిళ్ తై వాజ్ఝుచి' మాత్రమే పాడబడింది. గవర్నర్ గౌరవంగా సభకు తమ రాజ్యాంగ కర్తవ్యం గురించి గుర్తు చేసి, ముఖ్యమంత్రి ఎం.కే. స్టాలిన్ గారితో పాటు సభాధ్యక్షుల వద్ద జాతీయ గీతం పాడమని అభ్యర్థించారు. అయితే, వారు అవమానకరంగా తిరస్కరించారు. ఇది అత్యంత ఆందోళనకరమైన విషయం.” అని రాసుకొచ్చారు. అయితే ప్రభుత్వ తీరుకు నిరసనగా గవర్నర్ తో పాటు ప్రతిపక్షాలు కూడా అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశాయి.