- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Nail Polish: వామ్మో.. ఈ నెయిల్ పాలిష్ ధర అక్షరాలా కోటి రూపాయలు.. దీని స్పెషల్ తెలిస్తే వావ్ అనాల్సిందే
దిశ, వెబ్ డెస్క్ : ప్రతీ అమ్మాయి అందంగా ఉండాలని కోరుకుంటుంది. దీని కోసం ఎంతో డబ్బు ఖర్చు పెడతారు. కొందరైతే సంపాదించిన డబ్బు మొత్తం బ్యూటీ ప్రొడక్ట్స్ కి పెడతారు. ముఖ్యంగా, అమ్మాయిల చేతులను అందంగా ఉంచడంలో నెయిల్ పాలిష్ ( Nail Polish) కీలక పాత్ర పోషిస్తుంది. దీని కోసం మహిళలు రంగు రంగుల నెయిల్ పాలిష్ లను కొంటుంటారు. అయితే, సాధారణంగా నెయిల్ పాలిష్ రూ. 40 నుంచి రూ. 50 రూపాయలు ఉంటుంది. బ్రాండెడ్ అయితే ఒక వేలల్లో ఉంటుంది. కానీ, ఒక చిన్న నెయిల్ పాలిష్ రేటు కోట్లలో ఉంటుందంటే నమ్ముతారా? ఇది వినడానికి షాకింగ్ గా ఉన్నా .. కానీ, ఇది నిజమే. అదేంటో ఇక్కడ చూద్దాం..
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఈ నెయిల్ పాలిష్ ని లాస్ ఏంజెల్స్ డిజైనర్ అజాచర్ పోగోస్యాన్ రూపొందించారు. ఈ నెయిల్ పాలిష్ పేరు అజాచర్. ఇది నలుపు రంగులో ఉంటుంది. అయితే, దీనిలో 267 క్యారెట్ల నల్లని వజ్రాలు ఉన్నాయి. ఈ ప్రత్యేకమైన నెయిల్ పాలిష్ ధర రూ.1.9 కోట్లు పలుకుతుంది. దీనిలో వజ్రాలు ఉన్నాయి అందుకే అంత ఖరీదు ఉంది. అంతేకాదు దీని తయారీలో ఉపయోగించే ప్లాటినం పౌడర్ కూడా చాలా కాస్టలీ ది వాడారు. ఇది అందాన్ని పెంచడమే కాకుండా లగ్జరీ గా కూడా ఉంటుంది.