Mahakumbh : హిందూయేతరుల షాప్స్‌కు అనుమతులిస్తే.. వాటిపై ఉమ్ముతారు : మహంత్ రవీంద్ర పురి

by Hajipasha |
Mahakumbh : హిందూయేతరుల షాప్స్‌కు అనుమతులిస్తే.. వాటిపై ఉమ్ముతారు : మహంత్ రవీంద్ర పురి
X

దిశ, నేషనల్ బ్యూరో : అఖిల భారతీయ అఖాడా పరిషత్ అధ్యక్షుడు మహంత్ రవీంద్ర పురి(Mahant Ravindra Puri) మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్ రాజ్‌(Prayagraj)లో జరగనున్న మహాకుంభ మేళా(Mahakumbh)లో దుకాణాల ఏర్పాటుకు హిందూయేతరుల(non Hindus)ను అనుమతించరాదని ఆయన డిమాండ్ చేశారు. ప్రత్యేకించి టీ షాపులు, జ్యూస్ షాపులు, పూల షాపుల ఏర్పాటుకు వాళ్లకు అవకాశం ఇవ్వకూడదన్నారు.

‘‘ఒకవేళ టీ, జ్యూస్, పూల షాపులు పెట్టుకునేందుకు హిందూయేతరులకు అవకాశమిస్తే.. వాటిపై వాళ్లు ఉమ్ముతారు, మూత్రం చేస్తారు. అలాంటివి జరిగితే మా నాగా సాధువులు చర్యలు తీసుకోవాల్సి వస్తుంది’’ అని మహంత్ రవీంద్ర పురి వార్నింగ్ ఇచ్చారు. ‘‘మహాకుంభ మేళా వేళ అలాంటి ఘటనలు జరిగితే హిందువుల మనోభావాలు దెబ్బతింటాయి. ప్రపంచవ్యాప్తంగా తప్పుడు సందేశాలు వెళ్తాయి. ఈ మేళా శాంతియుతంగా, సురక్షితంగా, పవిత్రంగా జరగాలంటే హిందూయేతరులను దూరంగా ఉంచాలి’’ అని ఆయన వ్యాఖ్యానించారు. కాగా, మహా కుంభమేళాలో దుకాణాల ఏర్పాటుకు హిందూయేతరులకు అవకాశమివ్వకుంటే సమాజంలో విభజనరేఖ ఏర్పడుతుందని ఆలిండియా ముస్లిం జమాత్ ఆందోళన వ్యక్తం చేసింది.

Advertisement

Next Story

Most Viewed