రేవంత్ అన్న తాలూకా.. బరాబర్ తాగుతా.. అర్థరాత్రి మందుబాబు హంగామా!

by Bhoopathi Nagaiah |
రేవంత్ అన్న తాలూకా.. బరాబర్ తాగుతా.. అర్థరాత్రి మందుబాబు హంగామా!
X

దిశ, వెబ్‌డెస్క్ : కడుపులో చుక్క పడితే నోరు అదుపులో ఉండదు.. ఎప్పుడు ఏం మాట్లాడుతారో తెలియదు. ఎదురుగా ఉన్నది ఎవరో కూడా గుర్తించరు. కానీ తన లెవల్‌కు మించి మాట్లాడుతుంటారు మందుబాబులు. కొంతమంది గొడవలు దిగుతూ.. వితండవాదం చేస్తూ చిరాకు తెప్పిస్తుంటారు. మరి కొంత మంది నవ్వులు పుట్టిస్తుంటారు. తాజాగా డిసెంబర్ 31 నైట్ మందుబాబులు పోలీసులను ముప్పు తిప్పలు పెట్టారు. హైదరాబాద్‌లో ఓ మద్యం ప్రియుడు అర్థరాత్రి మందుతాగి వాహనం నడుపుతూ పోలీసులకు చిక్కాడు. పూటుగా మద్యం తాగిన వాహనదారుడు చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో నవ్వులు పూయిస్తున్నాయి. ‘‘తాను రేవంత్ అన్న తాలూకా..’’ అంటూ పోలీసులకు ఝలక్ ఇచ్చే ప్రయత్నం చేశాడు. ‘‘రేవంత్ అన్న తాగి రోడ్ల మీదికి రమ్మన్నాడా..? రేవంత్ అన్నను ఎందుకు బదనాం చేస్తున్నావ్.. ’’ అంటూ పోలీసు రివర్స్ క్వశ్చన్ వేయడంతో మందుబాబు దిక్కులు చూడటం మొదలు పెట్టాడు. చూడటానికి ఫన్నీగా ఉన్న వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

Advertisement

Next Story

Most Viewed