- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
దిశ ఒక సంచలనం.. పీఎస్ఆర్
దిశ, వెల్గటూర్ : పత్రికా రంగంలో దిశ సంచలనాలకు మారుపేరుగా నిలిచిందని రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు పోనుగోటి శ్రీనివాసరావు (పీఎస్ఆర్) అన్నారు. దిశ 2025 సంవత్సరం క్యాలెండర్ను ఆదివారం హైదరాబాద్ లోని తన నివాసంలో ఆవిష్కరించి పీఎస్ఆర్ మాట్లాడారు. సమీప కాలంలో వార్తలను అందించటంలో వేగం నిజాలను నిక్కచ్చిగా చెప్పటంలో చూపే ధైర్యం దిశకే సాధ్యమని కొనియాడారు. మారుతున్న ప్రపంచంలో ఉరుకులు పరుగుల జీవితంలో ఆన్ లైన్ విధానంలో అరచేతిలో తాజా తాజా వార్తలను అందించటంలో దిశ విజయవంతం అయిందన్నారు. ప్రధాన పత్రికలను వెనక్కి నెట్టేసి వేగంగా వార్తలను అందించటంలో దిశ ట్రెండ్ సెట్టర్ గా నిలిచిందన్నారు.
పత్రికలన్నీ దీనిని అనుసరించే స్థాయికి ఎదిగి ప్రజల మనసులను దోచుకుంది. వాస్తవాలను అందించే ఆన్ లైన్ పత్రికగా ప్రజల్లో ఒక ప్రత్యేక మైన నమ్మకాన్ని అనతి కాలంలోనే సాధించుకోవటాన్ని విశేషంగా చెప్పు కోవచ్చని అభిప్రాయ పడ్డారు. ఈ కార్యక్రమంలో కరాటే ప్రభాకర్ రాష్ట్ర కరాటే సంఘం అధ్యక్షులు, గాజుల రవికుమార్ జిల్లా కాంగ్రెస్ నాయకులు, గుంత సంతోష్ కుమార్, నక్క లక్ష్మణ్ యాదవ్ టీయుడబ్లుజె (ఐజేయు) రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.