- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి
దిశ,భిక్కనూరు : ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రూల్స్ పాటించాలని జిల్లా రవాణా శాఖ అధికారి శ్రీనివాస్ రెడ్డి సూచించారు. బుధవారం భిక్కనూరు టోల్ ప్లాజా వద్ద, నెలరోజుల పాటు జరిగే జాతీయ రోడ్డు భద్రత వారోత్సవాలను పురస్కరించుకొని మొదటి రోజు వాహనదారులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ పెట్టుకుని ప్రయాణం చేయాలని, లైసెన్స్ ఇన్సూరెన్స్ కలిగి ఉండాలన్నారు. ఫోర్ వీలర్ దారులు సీట్ బెల్ట్ పెట్టుకొని వాహనాన్ని డ్రైవింగ్ చేయాలన్నారు. ముఖ్యంగా డ్రైవింగ్ చేస్తున్నప్పుడు సెల్ ఫోన్ మాట్లాడకూడదన్నారు. హైవేపై ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు ట్రాఫిక్ రూల్స్ ప్రతి ఒక్క వాహనదారుడు పాటించాలన్నారు. జాతీయ రహదారిపై ట్రాఫిక్ రూల్స్ పాటించి ప్రమాదాలను నివారిద్దామన్న నినాదంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో ఎం వి ఐ భిక్షపతి, నాగలక్ష్మి, అశోక్ రవాణా శాఖ సిబ్బంది పాల్గొన్నారు.