Metro: హైదరాబాద్ నార్త్ సిటీ వాసులకు శుభవార్త.. మెట్రో పొడిగింపుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

by Ramesh Goud |   ( Updated:2025-01-01 12:33:39.0  )
Metro: హైదరాబాద్ నార్త్ సిటీ వాసులకు శుభవార్త.. మెట్రో పొడిగింపుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
X

దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్ ఉత్తర భాగం(Hyderabad North City) నగరవాసుల మెట్రో రైల్ కల నెరవేరబోతోంది. హైదరాబాద్ నార్త్ సిటీ వాసులకు నూతన సంవత్సర కానుకగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ప్యారడైజ్- మేడ్చల్ (23 కిలోమీటర్లు), జేబీఎస్- శామీర్ పేట్ (22 కిలోమీటర్లు) మెట్రో కారిడార్లకు(Metro carridars) డీపీఆర్(DPR) ల తయారీకి గ్రీన్ సిగ్నల్(Green Signal) ఇచ్చారు. వెంటనే డీపీఆర్‌లను సిద్ధం చేసి మెట్రో రైల్ ఫేజ్-2 'బి' భాగంగా కేంద్ర ప్రభుత్వ అనుమతికి పంపించవలసిందిగా హెచ్ఏఎంఎల్(HAML) ఎండీ ఎన్వీఎస్ రెడ్డి(NVS Reddy)ని ఆదేశించారు. ఈ రోజు పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీ దానకిషోర్, హెచ్ఏఎంఎల్ ఎండీ శ్రీ ఎన్వీఎస్ రెడ్డితో ఈ రెండు కారిడార్లకు డీపీఆర్ తయారీ విషయంలో చర్చించి ముఖ్యమంత్రి ఈ కీలకమైన నిర్ణయం తీసుకున్నారు.

ప్యారడైజ్ మెట్రో స్టేషన్ నుండి తాడ్ బన్డ్, బోయినపల్లి, సుచిత్ర సర్కిల్, కోంపల్లి, గుండ్లపోచంపల్లి, కండ్లకోయ, ఓఆర్ఆర్ ఎగ్జిట్ మీదుగా మేడ్చల్ కు దాదాపు 23 కిలోమీటర్ల కారిడార్ ఉంటుందని, అదే విధంగా జేబీఎస్ మెట్రో స్టేషన్ నుండి విక్రంపురి, కార్ఖానా, తిరుమలగిరి, లోతుకుంట, ఆల్వాల్, బొల్లారం, హకింపేట్, తూముకుంట, ఓఆర్ఆర్ ఎగ్జిట్ మీదుగా శామీర్ పేట్ కు 22 కిలోమీటర్ల పొడవునా ఈ కారిడార్ విస్తరించి ఉంటుందని మెట్రో ఎండీ ముఖ్యమంత్రికి వివరించారు. గత మల్కాజ్ గిరి ఎంపీగా ఈ ప్రాంతం ట్రాఫిక్ సమస్యలపై, ఈ కారిడార్ ల రూట్ మ్యాప్ లపై తనకు మంచి అవగాహన ఉందని, అయినా రూట్ మ్యాప్ విషయంలో ప్రస్తుత మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్ కు కూడా వివరించి ఆయన సూచనలు, సలహాలను కూడా తీసుకోవలసిందిగా ముఖ్యమంత్రి మెట్రో ఎండీని ఆదేశించారు.

డీపీఆర్ తయారీని 3 నెలల్లో పూర్తి చేసి రాష్ట్ర ప్రభుత్వ అనుమతి తీసుకోవాలని సీఎం సూచించినట్టు ఎండీ చెప్పారు. మెట్రో ఫేజ్-2 'ఏ' భాగం లాగే 'బి' భాగాన్ని కూడా కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల జాయింట్ వెంచర్ ప్రాజెక్టుగా రూపొందించాలని ముఖ్యమంత్రి ఆదేశించినట్టు మెట్రో ఎండీ తెలిపారు. ఈ ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వ అనుమతికి పంపించాలని ముఖ్యమంత్రి ఆదేశించారని, ఈ మేరకు వెంటనే డీపీఆర్ మరియు ఇతర అనుబంధ డాక్యుమెంట్ ల తయారీ చేపడుతున్నట్టు మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి వివరించారు.

Advertisement

Next Story

Most Viewed