Vande Bharat Train : సికింద్రాబాద్‌- విశాఖ మధ్య వందేభారత్ రైలు!

by Y. Venkata Narasimha Reddy |
Vande Bharat Train : సికింద్రాబాద్‌- విశాఖ మధ్య వందేభారత్ రైలు!
X

దిశ, వెబ్ డెస్క్ : సికింద్రాబాద్-విశాఖ(Secunderabad and Visakhapatnam)ల మధ్య త్వరలో మరో వందేభారత్ రైలు(Vande Bharat Train) సౌకర్యం ప్రజలకు అందుబాటులోకి రానుంది. సికింద్రాబాద్-విశాఖల మధ్య నడిపేందుకు 20 బోగీల వందేభారత్‌ రైలు సిద్ధమైంది. విశాఖ నుంచి శ్రీకాకుళం రోడ్‌ వెళ్లి, తిరిగి సాయంత్రానికి విశాఖ చేరుకోవడం ద్వారా ఈ మార్గంలో వందే భారత్ రైలు ట్రయల్ రన్ పూర్తి చేసినట్లుగా రైల్వేశాఖ తెలిపింది. ఈ వందే భారత్ రైలులో 18 ఏసీ చైర్‌కార్‌ బోగీలతో పాటు, 2 ఎకానమీ చైర్‌ బోగీలు ఉన్నాయి. ఈ రైలుకు ప్రధాని నరేంద్ర మోడీ (Prime Minister Narendra Modi)ఏపీ పర్యటనలో భాగంగా ఈ నెల 8న పచ్చ జెండా ఊపి(Green Flag on the 8th)ప్రారంభించనున్నట్లుగా సమాచారం.

సికింద్రాబాద్-విశాఖల మధ్య వందే భారత్ రైలు ప్రయాణానికి ప్రయాణికుల నుంచి డిమాండ్ ఎక్కువైంది. విశాఖపట్నంలో ఇప్పటికే 20 ఆరెంజ్‌ రంగు బోగీలతో ఓ వందేభారత్‌ రైలు సిద్ధంగా ఉంది. అయితే ప్రస్తుతం విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్‌కు ఉదయం బయల్దేరి వెళ్లే 16 బోగీల వందేభారత్ ఎక్స్‌ప్రెస్ స్థానంలో కొత్తదాన్ని అందుబాటులోకి తెస్తారని..ఇందుకు భారతీయ రైల్వే శాఖ అనుమతి ఇచ్చినట్లు సమాచారం. ఉదయం 10 గంటలకు విశాఖలో బయలుదేరి శ్రీకాకుళం రోడ్ వరకు ఇది వెళ్లనున్నట్లు సమాచారం.

Advertisement

Next Story

Most Viewed