Formula E Race Case : ఫార్ములా ఈ రేసు కేసులో కొత్త నిజాలు : బయటపెట్టిన ప్రభుత్వం

by Y. Venkata Narasimha Reddy |   ( Updated:2025-01-06 12:14:43.0  )
Formula E Race Case : ఫార్ములా ఈ రేసు కేసులో కొత్త నిజాలు : బయటపెట్టిన ప్రభుత్వం
X

దిశ, వెబ్ డెస్క్ : రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తున్న ఫార్ములా ఈ రేసు కేసు(Formula E Race Case)లో కొత్త నిజాలను ప్రభుత్వం(State Government)బయటపెట్టడం(Reveals) సంచలనంగా మారింది. రేసు నిర్వహించిన గ్రీన్ కో కంపనీ(Green Co Company) నుంచి అప్పటి అధికార బీఆర్ఎస్(BRS) పార్టీకి ఎన్నికల బాండ్ల(Electoral Bonds)రూపంలో భారీ ఎత్తున కోట్ల రూపాయల లబ్ధి చేకూరినట్లుగా ప్రభుత్వం వెల్లడించింది. ఈ ఫార్ములా రేసులో కొన్ని నిజాలు..దీని భావమేమి ‘తిరుకేషా’ అంటూ సీఎం రేవంత్ రెడ్డి పీఆర్వో బోరెడ్డి అయోధ్య రెడ్డి (CM PRO Boreddy Ayodhya Reddy) చేసిన ట్వీట్ వైరల్ గా మారింది. ఈ ఫార్ములా రేసు నిర్వహించిన గ్రీన్ కో కంపెనీ ద్వారా బీఆర్ఎస్ పార్టీకి ఎన్నికల బాండ్ల రూపంలో 49 కోట్లు చెల్లింపు(49 Crores Payments)లు జరిగాయని అయోధ్యరెడ్డి పేర్కొన్నారు.

గ్రీన్ కో, దాని అనుబంధ సంస్థలు 41 సార్లు(41 Times)బీఆర్ఎస్ పార్టీకి ఎన్నికల బాండ్ల రూపంలో చందాలు అందించాయని, రేసుకు సంబంధించిన చర్చలు మొదలయినప్పటి నుండే ఎన్నికల బాండ్లను గ్రీన్ కో సంస్థ కొనుగోలు చేసిందని వెల్లడించారు. 2022, 8 ఏప్రిల్ నుంచి అక్టోబర్ 10 మధ్య బాండ్లను కొనుగోలు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. ప్రతి సారి రూ. కోటి విలువ చేసే బాండ్లను గ్రీన్ కో కంపెనీ కొనుగోలు చేసిందని, మొత్తం రూ. 49 కోట్లను ఎన్నికల బాండ్ల రూపంలో బీఆర్ఎస్ కు గ్రీన్ కో సంస్థ చెల్లించిందని ఆయన వెల్లడించడం సంచలనంగా మారింది.

Advertisement

Next Story