IND Vs AUS: రిషభ్ పంత్ ఊచకోత.. 29 బంతుల్లోనే హాఫ్ సెంచరీ

by Shiva |   ( Updated:2025-01-04 06:40:21.0  )
IND Vs AUS: రిషభ్ పంత్ ఊచకోత.. 29 బంతుల్లోనే హాఫ్ సెంచరీ
X

దిశ, వెబ్‌డెస్క్: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ (Border-Gavaskar Trophy)లో భాగంగా సీడ్నీ (Sydney) వేదికగా జరుగుతోన్న నాలుగో టెస్ట్‌లో కిపర్ రిషభ్ పంత్ (Rishabh Pant) ఆసిస్ బౌలర్లను ఊచకోత కోశాడు. విరాట్ కోహ్లీ (6) అవుటయ్యాక క్రీజ్‌లోకి వచ్చిన పంత్ కంగరూ బౌలర్లకు కంగరెత్తించాడు. ఏకంగా 29 బంతుల్లోనే హాఫ్ సెంచరీ బాదేశాడు. వెబ్‌‌స్టర్ (Webster) వేసిన 17వ ఓవర్‌లో ఏకంగా మూడు ఫోర్లు, మిచెల్ స్టార్క్ (Mitchell Starc) వేసిన 21వ ఓవర్‌లో రెండు సిక్సర్లు బాదాడు. ఈ క్రమంలోనే టెస్ట్‌లలో తక్కువ బంతుల్లో హాఫ్ సెంచరీ చేసిన భారత బ్యాట్స్‌‌మెన్లలో తన రికార్డుకు తానే చేరువయ్యాడు. 2022లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో రిషభ్ పంత్ 28 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేశాడు. ఆ తరువాతి స్థానాల్లో కపిల్‌దేవ్ (Kapil Dev)30, శార్దూల్ ఠాకూర్ (Shardul Takur) 31, యశస్వీ జైస్వాల్ Yashaswi Jaiswal 31 ఉన్నారు. ప్రస్తుతం సిడ్నీ టెస్ట్‌లో టీమిండియా 5 కీలక వికెట్లను కోల్పోయి 128 పరుగులు చేసింది. రవీంద్ర జడేజా (2), నితీష్ రెడ్డి (4) పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. భారత జట్టు ఆస్ట్రేలియా కంటే 132 పరుగుల ఆధిక్యంలో ఉంది.

Advertisement

Next Story

Most Viewed