Kannappa: ‘కన్నప్ప’ నుంచి పార్వతి దేవీగా కాజల్ అగర్వాల్ లుక్.. ఆకట్టుకుంటున్న పోస్టర్..

by Kavitha |   ( Updated:2025-01-06 10:53:10.0  )
Kannappa: ‘కన్నప్ప’ నుంచి పార్వతి దేవీగా కాజల్ అగర్వాల్ లుక్.. ఆకట్టుకుంటున్న పోస్టర్..
X

దిశ, సినిమా: మంచు విష్ణు(Manchu Vishnu) డ్రీమ్ ప్రాజెక్ట్‌గా రాబోతున్న భారీ బడ్జెట్ మూవీ ‘కన్నప్ప’(Kannappa). ఈ సినిమాకు ముఖేష్ కుమార్ సింగ్(Mukesh Kumar Singh) దర్శకత్వం వహిస్తుండగా.. దీనిని అవా ఎంటర్‌టైన్‌మెంట్స్(Ava Entertainments), 24 ఫ్రేమ్స్ బ్యానర్స్‌పై మోహన్ బాబు(Mohan Babu) నిర్మిస్తున్నారు. ఇందులో ప్రభాస్(Prabhas), అక్షయ్ కుమార్(Akshay Kumar), మోహన్ లాల్(Mohanlal), మోహన్ బాబు వంటి స్టార్స్‌తో పాటు మంచు ఫ్యామిలీ(Manchu Family) మొత్తం ఈ చిత్రంలో నటిస్తున్నారు. ఇక ‘కన్నప్ప’సినిమా ప్రపంచవ్యాప్తంగా వచ్చే ఏడాది ఏప్రిల్ 25న థియేటర్స్‌లో విడుదల కాబోతుంది. ఈ క్రమంలో.. మూవీ మేకర్స్ ప్రమోషన్స్ స్టార్ట్ చేసి వరుస అప్డేట్స్ ఇస్తున్నారు.

అయితే ప్రతి సోమవారం ఓ పోస్టర్ విడుదల చేస్తామని చిత్రబృదం ప్రేక్షకులకు మాట ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ‘కన్నప్ప’లో నటిస్తున్న పాత్రలను రివీల్ చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. అయితే ఇప్పటివరకు ఇచ్చిన ప్రతి లుక్ ఆకట్టుకోగా.. తాజాగా, చిత్రబృందం ఈ సినిమాకు సంబంధించిన మరో అప్డేట్ విడుదల చేస్తూ x ద్వారా ఓ పోస్ట్ పెట్టింది. ఇందులో హీరోయిన్ కాజల్ అగర్వాల్‌(Kajal Agarwal)కు సంబంధించిన లుక్‌ను విడుదల చేస్తూ.. ‘ముల్లోకాలు ఏలే తల్లి! భక్తుల్ని ఆదుకునే త్రిశక్తి! శ్రీకాళహస్తిలో వెలసిన శ్రీ జ్ఞాన ప్రసూనాంబిక!’ అని పోస్టర్ పై రాసి ఉంది. ఫైనల్‌గా ఈ బ్యూటీ పార్వతి దేవీ(Parvathi Devi) లుక్‌లో అదిరిపోయింది అనే చెప్పాలి. కాగా కాజల్ ఈ పోస్ట్‌ర్‌ను షేర్ చేస్తూ ‘నా కల నిజమైంది, దీని కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నాను’ అంటూ ఇంట్రెస్టింగ్ క్యాప్షన్ రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Advertisement

Next Story