- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
మత్స్యకారుల వలకు చిక్కిన భారీ తిమింగలం
by Jakkula Mamatha |
X
దిశ,అచ్యుతాపురం: అచ్యుతాపురం మండలం పూడిమడక సముద్ర తీరంలో ఆదివారం చోటు చేసుకున్న ఈ సంఘటన మత్స్యకారులను తీవ్ర ఆశ్చర్యానికి గురి చేసింది. వేటకు వెళ్లిన మత్స్యకారుల వలలో చిక్కిన భారీ తిమింగలం వలలను నాశనం చేయడమే కాకుండా, వలలో ఉన్న చేపలను కూడా తినేసినట్లు తెలిపారు. తిమింగలాన్ని సముద్రం ఒడ్డుకు తీసుకురావడంలో వారు విఫలమయ్యారు, చివరికి ఒడ్డున వదిలేయాల్సి వచ్చినట్లు మత్స్యకార నాయకుడు వాసుపల్లి శ్రీనివాసరావు వెల్లడించారు. ఈ సంఘటన స్థానికంగా ఆసక్తికర చర్చకు దారితీసింది. ప్రకృతిలో ఇలాంటి సంఘటనలు అరుదుగా జరుగుతాయని, పూడిమడక మత్స్యకారులు దీన్ని ఒక అపూర్వమైన అనుభవంగా భావిస్తున్నప్పటికీ, తిమింగలం వల్ల కలిగిన నష్టం పై ఆందోళన వ్యక్తం చేశారు.
Advertisement
Next Story