భక్త జనసంద్రంగా వర్గల్ శ్రీ విద్యాధరి క్షేత్రం

by Aamani |
భక్త జనసంద్రంగా వర్గల్ శ్రీ విద్యాధరి క్షేత్రం
X

దిశ,వర్గల్: తెలంగాణ జిల్లాల్లో సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం గా వెలుగొందుతున్న వర్గల్ శ్రీ విద్యాధరి క్షేత్రం ఆంగ్ల నూతన సంవత్సర పర్వదినాన్ని పురస్కరించుకొని బుధవారం భక్తులతో కిక్కిరిసిపోయింది. ఈ సందర్భంగా వేలాదిగా తరలివచ్చిన భక్తులు శ్రీ విద్యాధరి క్షేత్రం తో పాటు శ్రీ లక్ష్మీ గణపతి, శ్రీ శనీశ్వర క్షేత్రం, శ్రీ చంద్రమౌళీశ్వర, శ్రీ సుబ్రహ్మణ్య, శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయాలను దర్శించుకున్నారు. కాగా భక్తుల దీని దృష్టిలో పెట్టుకొని ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ముందస్తు ఏర్పాట్లు చేయగా, క్షేత్ర వ్యవస్థాపక చైర్మన్, బ్రహ్మశ్రీ యాయవరం చంద్రశేఖర శర్మ సిద్ధాంతి నేతృత్వంలో భక్తులకు మహా ప్రసాదం అందజేశారు. అలాగే భక్తులు తమ చిన్నారులకు అక్షర స్వీకారం చేయించుకోవడం పాటు శని క్షేత్రంలో స్వామివారికి తిల తైలాభిషేకం చేశారు.

Advertisement

Next Story