- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
మందు బాబుల సేఫ్ జర్నీ.. ట్రాఫిక్ పోలీసుల డ్యూటీ కి సెల్యూట్…
దిశ, సిటీ క్రైమ్ : గ్రేటర్ హైదరాబాద్ లో ఒక్క చిన్న యాక్సిడెంట్ జరగకుండా ట్రాఫిక్ పోలీసులు, ఇతర పోలీసు విభాగాల పోలీసు అధికారులు నిర్వహించిన డ్యూటీకి హైదరాబాద్ గ్రేటర్ ప్రజలు సెల్యూట్ అంటున్నారు. తనిఖీల సమయంలో మందుబాబులు ప్రదర్శించిన రుబాబు, భూతులతో విరుచుకుపడ్డ తీరు, మద్యం మత్తులో పోలీసులకు ఇచ్చిన ధమ్కీ లను పరిశీలిస్తే ఎవరికైనా కోపం రావాల్సిందే కానీ మన పోలీసులు మాత్రం చాలా ఓర్పు, సహనం, శాంతితో వారి మాటలను పట్టించుకోకుండా విధులను నిర్వహించి డిసెంబర్ 31 రోజు రాత్రి 8 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు విధులను నిర్వహించి రోడ్డు ప్రమాదాలు జరగకుండా కొత్త సంవత్సరానికి స్వాగతం పలికారు. ఇలా పోలీసులు నిర్వహించిన డ్యూటీ, మందుబాబుల హంగామా కు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండడంతో వాటిని చూసిన మిగతా జనం పోలీసులు చేసిన డ్యూటీతో నూతన సంవత్సరం రోజు రోడ్డు ప్రమాదాల బారిన పడి చోటు చేసుకునే విషాదాలకు చెక్ పెట్టారిన ప్రశంసల వర్షం కురిపించారు.
ట్రాఫిక్ పోలీసుల పై రుబాబు ప్రదర్శిస్తూ..పరుగులు పెట్టించిన కొన్ని సందర్భాలకు సంబంధించిన సంఘటనలు ఇలా...
1. నా బండి ఎందుకు తీసుకుపోతున్నారు...వీడియో తీసి ఏం చేస్తారు...నన్ను టచ్ చేయలేరు. మీరేం పీ....రా అంటూ ఓ యువకుడు నాంపల్లి ప్రాంతంలో హాల్ చల్ చేశాడు.
2. జిందగీలో నీవు ఎప్పుడు మందు తాగలేదా...అయితే శభాష్...రోడ్డు మీద చాలా మంది మద్యం సేవించి వెళ్తున్నారు..నన్ను ఒకడిని ఎందుకు పట్టుకున్నారంటూ రాజేంద్రనగర్ ప్రాంతంలో ఓ మందు బాబు చెందేశాడు. మీరు ఇప్పుడు పట్టుకున్నారు కదా మీరు ఎంతైనా చలాన్ వేయండి, ఏడాది జైలు వేయండి అయినా నేను రూల్స్ పాటించను...ఏం చేసుకుంటారో చేసుకోండంటూ మొహం మీద చేతి వేళ్లు ఎత్తి చూపిస్తు నానా యాగీ చేశాడు.
3. నేను బండి నడపలేదు...నడుచుకుంటూ వస్తున్నా....బండి పార్క్ చేస్తున్నా...వచ్చి మీరు పట్టుకున్నారంటూ మరో మందు బాబు వీరంగం చేశాడు.
4. ఈ రోడ్డు ఏమైనా మీ జాగీరా ...మీరు బండి ఆపిన తర్వాత నాకు ఎందుకు తనిఖీలు చేస్తున్నారు. నాకు 5 వేలు ఫైన్ వేయండి ...కాని నేను పార్క్ చేసిన తర్వాత ఎందుకు తనిఖీ చేస్తున్నారు రా...అంటూ భూతులు తిట్టారు.
5.మహిళలు ఉన్నారని చూడకుండా ఎలా ఆపుతారు. ఏం డ్యూటీ చేస్తున్నారు మీరంటూ మద్యం సేవించి వాహనం నడుపుతూ వస్తున్న వ్యక్తితో కలిసి వస్తున్న మహిళలు కూడా వారు చేస్తున్నది తప్పని తెలిసినా పోలీసులతో వాగ్వివాదానికి దిగారు.
ఇలా పోలీసులపై మద్యం సేవించిన మత్తులో చిందేసిన మందుబాబులు..... వారంతా డ్యూటీ చేసింది మందుబాబులు ప్రమాదాల బారిన పడకుండా ఇంటికి క్షేమంగా చేరుకోవడానికేనని గుర్తించుకోవాలని నెటిజన్ లతో నగర ప్రజలు కూడా పోలీసులకు కితాబును ఇచ్చారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసు సిబ్బంది నిర్వహించిన డ్యూటీతో యాక్సిడెంట్ ఫ్రీ న్యూ ఇయర్ గా నమోదు కావడంతో పోలీసు బాస్ లు వారికి అభినందనలు తెలిపారు.