సీఎం కొత్త నిర్ణయాలతో పార్టీకి మైలేజ్ : ఎంపీ మల్లు రవి

by Bhoopathi Nagaiah |
సీఎం కొత్త నిర్ణయాలతో పార్టీకి మైలేజ్ : ఎంపీ మల్లు రవి
X

దిశ, తెలంగాణ బ్యూరో : మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు సంతాపాన్ని తెలియజేసేందుకు అసెంబ్లీ ఏర్పాటు చేయడం అభినందనీయమని ఎంపీ మల్లు రవి పేర్కొన్నారు. సీఎం కొత్త నిర్ణయాలతో కాంగ్రెస్ కు మరింత మైలేజ్ వస్తుందన్నారు. మన్మోహన్ సింగ్ ను తెలంగాణ ప్రజలు గుర్తు చేసుకోవడం బాధ్యత అంటూ ఆయన ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కోసం ఆయన ఎనలేని కృషి చేశారన్నారు. ఆయన ప్రధాన మంత్రిగా ఉన్న సమయంలోనే తెలంగాణ ఏర్పాటు జరిగిందన్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ అసెంబ్లీ లో సంతాప తీర్మానాన్ని పెట్టి ఆయన గొప్పదనాన్ని చర్చించుకోవడం సంతోషకరమన్నారు. ఆయన చేసిన గ్లోబలైజేషన్, ఆర్థిక సంస్కరణలు భవిష్యత్ తరాలకు తెలిసేలా అధికారికంగా సభ నిర్వహించడం గొప్ప విషయమన్నారు.

ఆర్థిక మార్గదర్శిగా, భవిష్యత్ భారత్ కోసం తన మేధ సంపత్తిని ఉపయోగించి పటిష్టమైన ఆర్థిక పునాదులు వేసిన వ్యక్తి మన్మోహన్ సింగ్ అని గుర్తు చేశారు. ఆహార భద్రత చట్టం, పని హక్కు, విద్య హక్కు చట్టం, సమాచార హక్కు లాంటి అనేక విప్లవాత్మక చట్టాలు తెచ్చిన మన్మోహన్ సింగ్ నేటి తరానికి ఆదర్శనీయులన్నారు. మన్మోహన్ సింగ్ మరణం తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ లో సంతాప దినాలు ప్రకటించడం, అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేయడంపై అభినందిస్తున్నానని వివరించారు. ఇది ఒక గొప్ప మేధావికి తెలంగాణ రాష్ట్రం చేస్తున్న ఘన నివాళి అంటూ ఎంపీ పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed