రూ.1000 కోట్లు " అబ్కారీ " న్యూ ఇయర్ టార్గెట్

by Kalyani |
రూ.1000 కోట్లు  అబ్కారీ  న్యూ ఇయర్ టార్గెట్
X

దిశ, జూబ్లీహిల్స్: న్యూఇయర్‌ వేడుకులను సిద్ధమవుతున్న హైదరాబాద్‌ యువత గ్రాండ్‌గా సెలబ్రేట్‌ చేసుకోవాలనుకునే యువతను ఆకట్టుకునే పబ్‌లు, ఈవేంట్‌ ఆర్గనైజర్లు..వివిధ ఆఫర్లతో రెడీ అవుతున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు పలు ఆంక్షలు విధించారు. రాత్రి ఒంటి గంట వరకు వేడుకలు ముగించుకోవాలని ఆదేశాలు జారీచేశారు. అదేవిధంగా జూబ్లీహిల్స్‌లోని 34 పబ్బుల్లో నాలుగు పబ్బులకు అనుమతి నిరాకరించారు. హాట్‌కప్‌, అమినేషియా, బ్రాండ్‌వే, బేబీ లాండ్‌ పబ్బుల్లో నూతన సంవత్సర వేడుకలకు పర్మిషన్‌ రద్దుచేసినట్లు అధికారులు తెలిపారు. కేవలం 10 గంటల వరకు మాత్రమే డీ జే పర్మిషన్‌ ఇచ్చారు.

అర్ధరాత్రి ఒంటి గంట వరకు అనుమతి

ఈ ఏడాది డిసెంబర్‌ 31వ తేదీన అర్ధరాత్రి ఒంటి గంట వరకు బార్లు తెరిచి ఉంచనున్నారు. దీంతో తాగినోళ్లకు తాగినంత మందును విక్రయించే ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే ఆయా క్లబ్‌లు, పబ్‌లకు భారీగా మద్యాన్ని తరలించారు. రాత్రి ఒంటి గంట వరకు ఈవెంట్ల నిర్వహణకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో మద్యం అమ్మకాలు భారీగా ఉంటాయని అంచనా వేస్తున్నారు. గత ఏడాది డిసెంబర్‌లో అధికారం చేపట్టిన కాంగ్రెస్‌ పార్టీ ఆ నెల చివరి వారంలో మద్యాన్ని ఏరులుగా పారించింది.

దసరా.. దీపావళి.. డిసెంబర్‌ 31.. న్యూ ఇయర్‌.. రాష్ట్రంలో ఆబ్కారీ శాఖకు డబ్బుల వర్షం కురిపించే పండుగలు. ఈ సారి డిసెంబర్‌ 31, జనవరి 1వ తేదీల్లో మద్యం అమ్మకాల ద్వారా సుమారు రూ. 1,000 కోట్లు సంపాదించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిసింది. ఈ మేరకు నిబంధనల్లో సడలింపు ఇవ్వనున్నట్టు చెప్పుకుంటున్నారు. ఇందుకోసం ప్రతి జిల్లా, ప్రతి డివిజన్‌కు ప్రత్యేక టార్గెట్‌లు ఫిక్స్‌ చేసినట్టు సమాచారం. న్యూ ఇయర్ వేడుకలు ముగేసే సరికి కాంగ్రెస్ ప్రభుత్వం .రూ. 1500 కోట్లకు తగ్గకుండా తాగించాలని టార్గెట్లు ఫిక్స్ చేసినట్లు తెలుస్తుంది.

Advertisement

Next Story