భువనగిరి కొత్త ఏసీపీ ఎవరో తెలుసా..?

by Naveena |
భువనగిరి కొత్త ఏసీపీ ఎవరో తెలుసా..?
X

దిశ, యాదాద్రి భువనగిరి ప్రతినిధి : భువనగిరి నూతన ఏసీపీగా రాహుల్ రెడ్డి ఐపీఎస్ బుధవారం బాధ్యతలను స్వీకరించారు. 2021 బ్యాచ్ కు చెందిన రాహుల్ రెడ్డి తెలంగాణ గ్రేహౌండ్స్ లో అడిషనల్ ఎస్పీగా బాధ్యతలు నిర్వర్తించారు. గత రెండు రోజుల క్రితం ఆయనను భువనగిరి ఏసీపీగా నియామకం చేస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఆయన అడిషనల్ ఎస్పీ హోదాలో భువనగిరి సబ్ డివిజన్ ఏసీపీగా బాధ్యతలు నిర్వర్తించనున్నారు. ఈ సందర్భంగా ఆయనకు ఇప్పటిదాకా ఏసీపీగా కొనసాగిన రవి కిరణ్ రెడ్డి నూతన ఏసీపీకి స్వాగతం పలికారు.

Advertisement

Next Story