New Year Tragedy : అమెరికాలో న్యూఇయర్ వేడుకల్లో విషాదం..10మంది మృతి

by Y. Venkata Narasimha Reddy |
New Year Tragedy : అమెరికాలో న్యూఇయర్ వేడుకల్లో విషాదం..10మంది మృతి
X

దిశ, వెబ్ డెస్క్ : న్యూ ఇయర్ వేడుక(New Year's celebrations)ల సందర్భంగా అమెరికా(America)లో తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది. నూతన సంవత్సరం సంబరాల్లో మునిగితేలుతున్న జనాలపైకి ఓ కారు దూసుకెళ్లిన(Car hit)ఘటనలో 10 మంది మృతి(10 people Died) చెందారు. మరో 30 మందికి గాయాలైనట్లు సమాచారం. లూసియానాలోని న్యూ ఆర్లీన్స్ లో ఈ ప్రమాదం చోటుచేసుకుందని సమాచారం. బోర్డన్ స్ట్రీట్, ఐబర్ విల్లే కూడలిలో న్యూ ఇయర్ వేడుకలు జరుపుకుంటున్న ప్రజలపై వేగంగా ఓ పికప్ ట్రక్ వాహనం దూసుకొచ్చిందని, అనంతరం డ్రైవర్ బయటకు వచ్చి జనాలపై కాల్పులు జరిపినట్లు తెలుస్తోందని స్థానిక మీడియా కథనం.

నిందితుడిపై పోలీసులు సైతం కాల్పులు జరిపినట్లుగా తెలుస్తోంది.ఈ విషాధ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సిఉంది. ఇటీవల జర్మనీలో క్రిస్మస్ వేడుకల్లోన ఓ వ్యక్తి ఇలాంటి ఘటనకు పాల్పడగా ఐదుగురు దుర్మరణం చెందారు.



Next Story