- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
వారసంతలో కల్తీ నూనెలు
దిశ, బోథ్ : మండలంలోని బోథ్, సోనాల గ్రామాలలో జరిగే వారసంతలలో జోరుగా కల్తీ నూనెల విక్రయాలు జరుగుతున్నట్లు ప్రజలు ఆరోపిస్తున్నారు. సంక్రాంతి పండుగ దగ్గరికి వస్తున్న తరుణంలో వివిధ గ్రామాల నుండి వారసంతకు వస్తున్న అమాయక ప్రజలకు వివిధ బ్రాండెడ్ పేర్లతో ఉన్న నూనె ప్యాకెట్లను తక్కువ రేటుకి అమ్ముతున్నారు. ఒరిజినల్ నూనె ప్యాకెట్లు అయితే ఇంత తక్కువ రేటుకు ఎందుకు అమ్ముతున్నారు అని ప్రజలు చర్చించుకుంటున్నారు.
అంతే కాకుండా కల్తీ నూనెలతో అనారోగ్యానికి గురవుతున్నామని, పచ్చడి పెడితే నెలరోజులు కూడా నిలువ ఉండడం లేదని వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాసిరకమైన నూనెను వాడడం వల్ల పలు రకాల వ్యాధులు సోకే ఆస్కారం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించి కల్తీ నూనెలు విక్రయిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వినియోగదారులు కోరుతున్నారు.