ట్రాఫిక్ నియమాలు పాటించకపోతే కఠిన చర్యలు : సంగారెడ్డి ఎస్పీ

by Aamani |
ట్రాఫిక్ నియమాలు పాటించకపోతే కఠిన చర్యలు : సంగారెడ్డి ఎస్పీ
X

దిశ, సంగారెడ్డి అర్బన్ : న్యూ ఇయర్ వేడుకల్లో భాగంగా ఎవరు కూడా మద్యం సేవించి వాహనాలు నడపొద్దు అని పోలీసులు ముందస్తు హెచ్చరికలు జారీ చేశారు. ఈ నెల 31న సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేష్ ఆదేశాల మేరకు పోలీస్ సిబ్బంది ముమ్మరంగా అర్ధరాత్రి వరకు వాహనాల తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో మొత్తం 282 మంది డ్రంక్ అండ్ డ్రైవ్ లో పోలీసులకు పట్టుబడ్డారు. బుధవారం వారిని కోర్టులో హాజరు పరిచి జైలుకు పంపించినట్లు ఎస్పీ వివరించారు. ఇకపై ఎవరైనా ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులతో పాటు వాహనాల తనిఖీలు నిరంతరం కొనసాగుతూనే ఉంటాయని ఆయన చెప్పారు.

డ్రగ్ ఫ్రీ జిల్లాగా మార్చడమే లక్ష్యం..

సంగారెడ్డి జిల్లాను డ్రగ్ ఫ్రీ జిల్లాగా మార్చడమే తమ లక్ష్యమని జిల్లా ఎస్పీ రూపేష్ స్పష్టం చేశారు. ప్రజలు మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండి డ్రగ్ ఫ్రీ జిల్లాగా మార్చడంలో తమ వంతు సహకారం అందించాలని కోరారు. మాదకద్రవ్యాల దుర్వినియోగం విషయమై సంగారెడ్డి జిల్లా పోలీస్ శాఖలో ఇప్పటికే ఏర్పాటు చేసిన S-Nab ద్వారా సత్ఫలితాలను రాబట్టడం జరిగిందని, అదేవిధంగా ఈ S-Nab పనితీరు మరింత మెరుగుపరిచి జిల్లాను డ్రగ్ ఫ్రీ జిల్లాగా మార్చడంలో కృషి చేయడం జరుగుతుందని జిల్లా ఎస్పీ అన్నారు. అదే విధంగా ఏదైనా చట్ట వ్యతిరేక కార్యకలాపాలు జరుగుతున్నట్లు ప్రజల దృష్టికి వచ్చినట్లయితే వెంటనే సంగారెడ్డి జిల్లా నార్కోటిక్ అనాలిసిస్ బ్రాంచ్ నెంబర్ 871265677 కు సమాచారం అందించవలసిందిగా జిల్లా ప్రజలను కోరడం జరుగుతుంది. సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయన్నారు.

Advertisement

Next Story

Most Viewed