MPHA Exam: మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ పోస్టుల నియామక పరీక్షకు 84.89 శాతం మంది హాజరు..!

by Maddikunta Saikiran |
MPHA Exam: మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ పోస్టుల నియామక పరీక్షకు 84.89 శాతం మంది హాజరు..!
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్టంలోని వివిధ ఆసుపత్రుల్లో(Hospitals) ఖాళీగా ఉన్న మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్(ఫిమేల్) నియామకాల కోసం వైద్య, ఆరోగ్య శాఖ ఇప్పటికే నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ రిక్రూట్మెంట్ ద్వారా 1520 పోస్టులను భర్తీ చేయనున్నారు. 2023 ఆగస్టు 25 నుంచి సెప్టెంబర్ 19 వరకు దరఖాస్తులను స్వీకరించారు. ఇదిలా ఉంటే.. ఈ పోస్టులకు సంబంధించి నియామక పరీక్ష(Exam)ను ఈ రోజు(ఆదివారం) నిర్వహించారు. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్(CBT) విధానంలో నిర్వహించిన ఈ పరీక్షకు 84.89 శాతం అభ్యర్థులు హాజరయినట్లు అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. మొత్తం 24,000 మంది అప్లై చేసుకోగా.. 20,600 మంది ఎగ్జామ్ రాశారని పేర్కొన్నారు. పరీక్ష తుది ఫలితాలను(Final Results) త్వరలోనే విడుదల చేస్తామని వెల్లడించారు. కాగా ఈ పోస్టులకు ఎంపికైన వారికి నెలకు రూ.31,040 నుంచి 92,050 మధ్య జీతం ఉంటుంది.

Advertisement

Next Story