సంచలనాలకు మారు పేరు ‘దిశ’ దినపత్రిక : ఉప్పల వెంకటేష్

by Aamani |
సంచలనాలకు మారు పేరు ‘దిశ’ దినపత్రిక : ఉప్పల వెంకటేష్
X

దిశ, తలకొండపల్లి : అనునిత్యం ప్రతి అక్షరం ప్రజల పక్షాన ప్రచురిస్తూ ప్రతిక రంగంలోనే దిశ నూతన ఒరవడికి శ్రీకారం చుడుతూ ముందుకు సాగుతుందని రాష్ట్ర మిషన్ భగీరథ మాజీ వైస్ చైర్మన్ ఉప్పల వెంకటేష్ అన్నారు. నూతన సంవత్సరం వేడుకలు పురస్కరించుకొని బుధవారం 2025 దిశ నూతన క్యాలెండర్ ను హైదరాబాద్ లోని తన నివాసంలో దిశ జర్నలిస్ట్ కే.చంద్రకుమార్, మహేష్, శ్రీనివాసులతో కలిసి క్యాలెండర్ను ఉప్పల వెంకటేష్ ఘనంగా ఆవిష్కరించారు. ఈ సంద్భంగా వెంకటేష్ మాట్లాడుతూ దిశ దినపత్రిక ఆనతి కాలంలోనే సంచలనాత్మక వార్తలు ప్రచురిస్తూ, గత 50 సంవత్సరాల చరిత్ర కలిగిన పెద్ద పేపర్లను తలదన్నే విధంగా పాఠకుల మనసులను గెలుస్తూ తనదైన శైలిలో ముందుకు దూసుకుపోతుందని ఆయన కొనియాడారు.

సమాజంలో ప్రతి నిత్యం ఎక్కడ ఎలాంటి సంఘటన జరిగినా క్షణాల్లో ప్రజలకు సమాచారాన్ని చేరవేయడంలో దిశకు ఎవరు సాటి లేరని పేర్కొన్నారు.దిశ క్యాలెండర్ ను ఆవిష్కరించిన వారిలో తలకొండపల్లి మాజీ ఎంపీపీ నిర్మల శ్రీశైలం గౌడ్, సర్పంచ్ల సంఘం మాజీ అధ్యక్షుడు గోపాల్ నాయక్, డీలర్ల సంఘం గౌరవ అధ్యక్షులు జగదీశ్వర్ గుప్తా, ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ జిల్లా మాజీ ఉపాధ్యక్షులు గుజ్జరి రాఘవేందర్, సుబ్రహ్మణ్యం, చుక్కాపూర్ గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాజలింగం, బుచ్చిబాబు, శ్రీనివాస్ తదితరులున్నారు.

Advertisement

Next Story

Most Viewed