- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Eatala Rajendar: చర్లపల్లి రైల్వే టర్మినల్ ప్రారంభోత్సవానికి తరలిరండి: ఈటల
దిశ, డైనమిక్ బ్యూరో: చర్లపల్లి రైల్వే టెర్మినల్ (Charlapally Railway Terminal) ప్రారంభోత్సవానికి ప్రజలు భారీగా తరలి రావాలని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ (Eatala Rajender) పిలుపునిచ్చారు. రూ.500 కోట్లతో ఏర్పాటు చేసిన చర్లపల్లి రైల్వే టెర్మినల్ ను జనవరి 6వ తేదీన ఉదయం 10 గంటలకు ప్రధాని నరేంద్ర మోడీ (Narendra Modi) వర్చువల్ గా ప్రారంభించబోతున్నారు. ఈ మేరకు శనివారం ఈటల ఓ ప్రకటన విడుదల చేశారు. హైదరాబాద్ నగరం వేగంగా విస్తరిస్తున్న తరుణంలో ఎయిర్ పోర్టును తలపించేలా కేంద్ర ప్రభుత్వం చర్లపల్లి రైల్వే టెర్మినల్ ను అధునాతన పద్ధతిలో నిర్మించిందని ఈ ప్రాంత ప్రజలు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి పెద్ద ఎత్తున హజరై విజయవంతం చేయాలన్నారు. చర్లపల్లి రైల్వే టర్మినల్ తో పాటు సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి రైల్వే స్టేషన్లు కూడా దాదాపు రూ. 1500 కోట్ల వ్యయంతో ఆధునీకరణ పనులు జరుగుతున్నాయన్నారు. రాబోయే రోజుల్లో రేల్వే శాఖ తెలంగాణకు, హైదరాబాద్ నగరానికి గొప్ప సౌకర్యాలు కల్పించబోతున్నదని చెప్పారు.