SRTRI: 12 ఏళ్ల తర్వాత స్వామి రామానంద తీర్థ చైర్మన్‌ నియామకం! ప్రభుత్వం ఉత్తర్వులు

by Ramesh N |   ( Updated:2025-01-04 08:00:28.0  )
SRTRI: 12 ఏళ్ల తర్వాత స్వామి రామానంద తీర్థ చైర్మన్‌ నియామకం! ప్రభుత్వం ఉత్తర్వులు
X

దిశ, డైనమిక్ బ్యూరో: యాదాద్రి జిల్లా భూదాన్‌ పోచంపల్లి మండలం జలాల్‌పూర్‌లో గల స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థ (ఎస్ఆర్‌టీఆర్‌ఐ) చైర్మన్‌గా ప్రొఫెసర్ (Kishore Reddy) ఎన్. కిషోర్ రెడ్డిని ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ (Panchayat Raj and Rural Development Department) తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో (Swamy Ramananda Tirtha Rural Institute) స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థలో గ్రామీణ నిరుద్యోగ యువతకు ఉపాధి ఆధారిత సాంకేతిక శిక్షణను అందిస్తున్న విషయం తెలిసిందే. ఏటా పది వేల మంది గ్రామీణ నిరుద్యోగ యువతకు స్కిల్ డెవలప్‌మెంట్‌లో శిక్షణ ఇస్తున్నారు.

అయితే, గత 12 ఏళ్లుగా సంస్థకు చైర్మన్‌తో పాటూ గవర్నింగ్‌ బాడీ సైతం లేకపోవడంతో విస్తరణ కేంద్రాలు, కొత్త కోర్సులను ప్రవేశపెట్టలేక పోయారు. ఈ క్రమంలోనే ఆ సంస్థ డైరెక్టర్‌గా ఉన్న కిషోర్ రెడ్డి ప్రభుత్వం చైర్మన్‌గా బాద్యతలు అప్పగించింది. కాగా, స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థ స్కిల్‌ యూనివర్సిటీగా మార్చాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం విదితమే.

Advertisement

Next Story