- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఉపాధిలేదు...ఉసురు తీసుకునేందుకు అనుమతించండి...
దిశ, జగిత్యాల కలెక్టరేట్ : తనకు ఏదైనా ఉద్యోగం ఇప్పించాలని, లేనిపక్షంలో కారుణ్య ఆత్మహత్యకు అయినా అనుమతించాలని కోరుతూ రాయికల్ మండలం అల్లీపూర్ గ్రామానికి చెందిన నక్క సునీత అనే మహిళ ప్రజావాణిని ఆశ్రయించింది. ముగ్గురు మానసిక దివ్యాంగులైన పిల్లలతో ఉపాధి లేక పోషణ భారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేసింది. ముగ్గురు పిల్లలు మానసిక దివ్యాంగులు కావడంతో తన భర్త ఉపాధి కొరకు గల్ఫ్ దేశానికి వలస వెళ్లినట్లు సునీత తెలిపింది. పీజీ స్పెషల్ బీఈడీ చదివిన తనకు కాంట్రాక్టు పద్ధతిలో ఏదైనా ఉద్యోగం ఇప్పించి ఆదుకోవాలని అధికారుల ద్వారా ప్రభుత్వాన్ని కోరింది. తన పిల్లలు లాగా చాలా మంది పేరెంట్స్ దివ్యాంగులైన పిల్లలను కలిగి ఉన్నారని, అలాంటి వారందరూ మానసికక్షోభకు గురవుతున్నట్లు వాపోయింది.
స్పెషల్ బీఈడీ చేసిన తనకు ప్రత్యేక ఉపాధ్యాయురాలిగా కాంట్రాక్టు పద్దతిలో అవకాశం కల్పిస్తే అలాంటి పిల్లలందరికీ చదువు చెప్తానని, తద్వారా తనకు ఉపాధి దొరుకుతుందని కోరింది. తనకు ఉద్యోగం ఇవ్వడానికి 370 జీవో అడ్డుగా ఉందని అధికారులు చెబుతున్నారని, కనీసం తన భర్త కైనా ఏదో ఒక ఉద్యోగం ఇప్పించి ఆదుకోవాలని వేడుకుంది. అయితే ఇటీవల డీఎస్సీ రాసినప్పటికి మెరిట్ రాలేదని చదువు పై మక్కువ ఉన్నప్పటికీ ముగ్గురు దివ్యాంగులైన పిల్లల బాగోగులు చూస్తూ చదవడం వల్ల 40% మార్కులు సాధించినట్లు తెలిపింది. ఉద్యోగం ఇవ్వడం సాధ్యం కానిపక్షంలో ముగ్గురు పిల్లలతో సహా తమకు ఆత్మహత్యనే శరణ్యమని అందుకే కారుణ్య ఆత్మహత్యకు అనుమతి ఇవ్వాల్సిందిగా ప్రజావాణిలో వినతి పత్రం అందజేసినట్లు తెలిపింది.