Devara : ‘దేవర’ 100 రోజుల స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసిన మేకర్స్

by Prasanna |   ( Updated:2025-01-04 12:30:05.0  )
Devara : ‘దేవర’ 100 రోజుల స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసిన మేకర్స్
X

దిశ, వెబ్ డెస్క్ : ఎన్టీఆర్ ( NTR ) హీరోగా తెరకెక్కిన దేవర ( Devara ) మూవీ ఎంత పెద్ద హిట్ కొట్టిందో మనకీ తెలిసిందే. కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో వచ్చిన ఈ సినిమాలో జాన్వీక‌పూర్ కథానాయికగా నటించింది. సైఫ్ అలీఖాన్ విలన్ పాత్రలో అదరగొట్టాడు. 2024 సెప్టెంబ‌ర్ 27న థియేటర్లలో విడుదలయ్యి మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుని రూ. 500 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. అయితే, తాజాగా ఎన్టీఆర్ తన ఖాతాలో కొత్త రికార్డు చేరింది,దేవర మూవీ 52 సెంటర్స్ లో 50 రోజులు మంచి రికార్డ్ సెట్ చేయగా, ఇప్పుడు ఈ మూవీ 100 రోజులను విజయవంతంగా పూర్తిచేసుకుంది. ఈ నేపథ్యంలోనే దేవర మూవీ యూనిట్ నుంచి 100 డేస్ స్పెషల్ పోస్టర్ ను విడుదల చేశారు. అలాగే, దేవర మూవీ 100 రోజులు ఆరు సెంటర్స్ లో ఆడుతుందని సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు.

చిలకలూరిపేట రామకృష్ణ థియేటర్, కొత్తకోట ద్వారకా థియేటర్, ఈస్ట్ గోదావరి జిల్లాలోని మలికిపురం పద్మజ థియేటర్, మండపేట రాజారత్న థియేటర్, కల్లూరు MNR థియేటర్, రొంపిచర్ల MM డీలక్స్ థియేటర్ లలో దేవర సినిమా 100 డేస్ ఆడినట్టు చిత్ర బృందం వెల్లడించింది.

Advertisement

Next Story