- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
విధులు సమర్థవంతంగా నిర్వహించాలంటే ఆరోగ్యం ముఖ్యం.. ఎస్పీ అఖిల్ మహాజన్
దిశ, రాజన్న సిరిసిల్ల ప్రతినిధి : నిరంతరం విధులు సమర్థవంతంగా నిర్వహించాలంటే ఆరోగ్యం ముఖ్యమని, నిత్యం యోగా సాధనతో ఆరోగ్యం పై పట్టుసాధించవచ్చనని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ సూచించారు. శనివారం ఉదయం ఆయన జిల్లా పోలీస్ కార్యాలయం వద్ద యోగా కార్యక్రమాన్ని నిర్వహించి, యోగా నిపుణులచే పోలీస్ అధికారులకు, సిబ్బందికి యోగాలో శిక్షణనిచ్చారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోలీస్ అధికారులు, సిబ్బంది ఎల్లప్పుడు విధినిర్వహణలో ఉండటం వలన తమ ఆరోగ్యం పట్టించుకోకపోవడంతో ఎన్నో రకాల అనారోగ్యాలకు గురవుతున్నారని, ఆరోగ్యంపై అవగాహన ఎంతో ముఖ్యమని, సిబ్బంది, అధికారులు ఆరోగ్యం పట్ల అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
పోలీసు దినచర్య, జీవన విధానం మిగతావారితో పూర్తి భిన్నంగా ఉంటుందని, మన ఆరోగ్య పరిరక్షణకై ప్రత్యేక చర్యలు తీసుకొనక తప్పదన్నారు. ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు నడక, వ్యాయామం, యోగా వంటివి మన దినచర్యలో భాగం చేసుకోవాలన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో వ్యాధులు ఎంతో వేగంగా విస్తరిస్తున్నాయని, వ్యాధుల బారిన పడకుండా ఉండేందుకు తగిన ఆరోగ్య సూచనలు పాటిస్తే ఎంతో మంచిదన్నారు. ఈ కార్యక్రమములో అదనపు ఎస్పీ చంద్రయ్య, డీఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి, ఆర్ఐలు మధుకర్, రమేష్, సీఐలు మొగిలి, మధుకర్, శ్రీనివాస్, ఎస్ఐలు, ఆర్ఎస్ఐ లు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.