Game Changer : గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఓ పండుగ : మంత్రి కందుల దుర్గేష్

by Y. Venkata Narasimha Reddy |
Game Changer : గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఓ పండుగ : మంత్రి కందుల దుర్గేష్
X

దిశ, వెబ్ డెస్క్ : రాజమండ్రి(Rajahmundry)వేదికగా నిర్వహిస్తున్న గేమ్ ఛేంజర్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్(Pre-Release Event) మెగా అభిమానులకు ఓ పండుగ(Festival)అని మంత్రి కందుల దుర్గేష్(Minister Kandula Durgesh)వ్యాఖ్యానించారు. శనివారం ఆయన సినిమా ఈవెంట్ ఏర్పాట్ల(Event arrangements)ను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ మెగా హీరో రాంచరణ్ నటించిన గేమ్ ఛేంజర్ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరవుతున్నారని తెలిపారు. సుమారు గంట పాటు పవన్ కళ్యాణ్ ఈ కార్యక్రమంలో పాల్గొంటారని వెల్లడించారు. పెద్ద సంఖ్యలో అభిమానులు వస్తుండటంతో శాంతి భద్రతల పరిరక్షణ పట్ల పోలీసులు, అభిమానులు అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు.

ఈ సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తల పట్ల మంత్రి అధికారులకు పలు సూచనలు చేశారు. రాజమండ్రి రూరల్ వేమగిరిలో గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తున్నారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ కు లక్ష మంది వరకు మెగా ఫ్యాన్స్ వచ్చే అవకాశముందని అంచనా వేస్తున్నారు. అభిమానులకు ఇబ్బంది లేకుండా భారీ ఏర్పాట్లు చేశారు. 40 ఎకరాల స్థలంలో ఈవెంట్ నిర్వహణకు ఏర్పాట్లు చేశారు.

Advertisement

Next Story