- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
పార్టీలు మీకేనా.. మేము కూడా చేసుకుంటాం..!
దిశ,కొత్తగూడ : పాత సంవత్సరానికి వీడ్కోలు చెబుతూ నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ యావత్తు ప్రపంచమంతా యువత, చిన్న, పెద్ద తేడా లేకుండా కేరింతలు పెడుతూ వేడుకల్లో మునిగిపోతారు. ఓ వానరం థంసప్ తాగుతూ చికెన్ తింటూ పార్టీలు మీరే చేసుకుంటారా..? మేము కూడా ధావత్ తో నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతాము , అంటూ గంతులు వేస్తూ చూపరులను కాసేపు సందడి చేసింది. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలోని గుంజేడు జాతరలో స్నేహితులు,కుటుంబ సభ్యులు చుక్క ముక్క తినే అంత తిని తాగే అంత తాగి వేడుకలు నిర్వహించుకున్నారు.
అందులో భాగంగా ఎక్కువైన థంసప్ వదిలేశారు. అది కాస్తా వానరాలకు దొరికింది. ఇంకేముంది థంసప్ లో కొంత శాతం ఆల్కహాల్ ఉంటుందని అంటారు చికెన్ తిని థంసప్ తాగిన వానరాలకు కిక్కు ఎక్కింది కావచ్చు. తిక్క తిక్క చేస్తూ గంతులు వేస్తూ కాస్త అలజడి చేసింది. అటుగా వెళ్ళే వాళ్ళంతా వింతగా చూస్తూ సెల్ ఫోన్ లతో ఫోటోలను బంధించుకున్నారు. సాధారణంగా ఎవరైనా అల్లరి చేస్తే కోతితో పోల్చుతారు. ఏకంగా కోతి యే కిక్కు ఎక్కి అల్లరి చేస్తే ఎలా ఉంటుందో ఆలోచించండి.