- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Rajagopal Reddy: ఆ ముగ్గురు జైలుకు వెళ్లక తప్పదు.. రాజగోపాల్ రెడ్డి సెన్సేషనల్ కామెంట్స్
దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో అధికారంలో ఉన్న తమ ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడటం లేదని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (MLA Komatireddy Rajagopal Reddy) అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ (BRS) అసలు ప్రతిపక్షమే లేకుండా చేసేందుకు కుట్రలు చేసిందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ (Congress Party) నుంచి గెలిచిన ఎమ్మెల్యేలను మంత్రి పదవులను ఆశ చూపి తమ పార్టీలో చేర్చుకున్నారని ఫైర్ అయ్యారు. కేసీఆర్ (KCR) కుటుంబం, బీఆర్ఎస్ నేతలు (BRS Leaders) తెలంగాణ రాష్ట్రాన్ని (Telangana State) నిలువునా దోచేశారని మండిపడ్డారు.
రానున్న రోజుల్లో కేసీఆర్ (KCR), కేటీఆర్ (KTR)లతో పాటు ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి మంత్రి పని చేసిన జగదీశ్వర్ రెడ్డి (Jagadishwar Reddy) కూడా జైలుకు వెళ్లక తప్పదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ ప్రభుత్వం ఏమాత్రం కక్ష సాధింపు చర్యలకు పాల్పడటం లేదన్నారు. ఓవైపు ‘రైతు భరోసా’ (Raithu Bharosa) పథకాన్ని ప్రారంభించాలని యోచిస్తుంటే.. కేటీఆర్ (KTR) తన స్థాయిని దిగజార్చుకుని మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. కేసీఆర్, కేటీఆర్, జగదీశ్ రెడ్డి పట్ల సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఉదారంగా వ్యవహరిస్తున్నారని.. ఆ స్థానంలో తనే ఉంటే ఆ ముగ్గురిని ఏనాడో జైల్లో వేసే వాడినని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు.