Raj Thackrey: సమస్యలు ఉన్నప్పుడు వస్తారు, కానీ ఎన్నికల టైంలో పట్టించుకోరు.. రాజ్ థాక్రే ఆవేదన

by vinod kumar |
Raj Thackrey: సమస్యలు ఉన్నప్పుడు వస్తారు, కానీ ఎన్నికల టైంలో పట్టించుకోరు.. రాజ్ థాక్రే ఆవేదన
X

దిశ, నేషనల్ బ్యూరో: ప్రజలు సమస్య వచ్చినప్పుడు తమ పార్టీ వద్దకు వస్తున్నారని కానీ ఎన్నికల టైంలో మాత్రం పట్టించుకోవడం లేదని మహారాష్ట్ర నవనిర్మాణ సేన (Maharashtra nava nirmana sena) అధ్యక్షుడు రాజ్ థాక్రే (Raj Thackrey) ఆవేదన వ్యక్తం చేశారు. కొత్త సంవత్సరం సందర్భంగా ఆయన ప్రజలకు సందేశం ఇచ్చారు. 25 ఏళ్లుగా ఎన్నో మార్పులు జరిగినప్పటికీ మరాఠా ప్రజలు మాత్రం ఇప్పటికీ ఉద్యోగావకాశాల కోసం వెతుక్కునే పరిస్థితి ఉందని తెలిపారు. ‘రాష్ట్రంలోని యువతకు ఉపాధి లేదు. కానీ బయటి నుంచి వచ్చిన వారికి మాత్రం అవకాశాలు దొరుకుతున్నాయి’ అని పేర్కొన్నారు.

‘రైతుల నుంచి పేదల వరకు కార్మికులందరి జీవితాలు ధరల పెరుగుదలతో నాశనమవుతున్నాయి. ఇవే గాక ప్రతి ఇతర సమస్య వచ్చినప్పుడు, ప్రజలు ఎంఎన్ఎస్‌ (MNS)ను ఆశ్రయిస్తారు. కానీ ఓటింగ్ సమయంలో పార్టీని మరచిపోతారు’ అని తెలిపారు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై తాను ఇంకా ఆలోచిస్తున్నానని, పార్టీకి దిశానిర్దేశం చేస్తానని సూచించారు. కాగా, ఇటీవల జరిగిన మహారాష్ట్ర (Maharashtra) అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఎన్ఎస్ ఘోర పరాజయం పాలైంది. 125 స్థానాల్లో పోటీ చేసిన ఆ పార్టీ ఒక్క స్థానంలోనూ విజయం సాధించలేదు. కేవలం 1.55శాతం ఓట్ షేరింగ్ మాత్రమే సాధించింది.

Advertisement

Next Story

Most Viewed