- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
తాడిపత్రిలో హైడ్రామా.. జనసేన నేత శ్రీకాంత్ రెడ్డి అరెస్ట్.. విడుదల
దిశ, వెబ్ డెస్క్: అనంతపురం జిల్లా తాడిపత్రి(Tadipatri)లో హైడ్రామా నెలకొంది. తాడిపత్రి జనసేన ఇంచార్జి కదిరి శ్రీకాంత్ రెడ్డి(Tadipatri Janasena incharge Kadiri Srikanth Reddy)ని శనివారం ఉదయం పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అయితే కొద్దిసేపటికే విడుదల చేశారు. దీంతో పోలీస్ స్టేషన్ నుంచి ఆయన ఇంటికి వెళ్లిపోయారు.
తాడిపత్రిలో శుక్రవారం పోలీసులపై శ్రీకాంత్ రెడ్డి విమర్శలు చేశారు. పోలీసులు దొంగలతో చేతులు కలిపి వాటాలు పంచుకుంటున్నారని ఆరోపణలు చేశారు. దీంతో పోలీసులు శనివారం ఉదయం శ్రీకాంత్ రెడ్డి ఇంటికి వెళ్లారు. విమర్శలపై వివరణ ఇవ్వాలని అడిగారు. దీంతో ఆగ్రహించిన శ్రీకాంత్ రెడ్డి పోలీసులతో దురుసుగా ప్రవర్తించారు. ఈ మేరకు ఆయన్ను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. అయితే వెంటనే విడుదల చేశారు. దీంతో ‘‘అసలు శ్రీకాంత్ రెడ్డిని ఎందుకు అరెస్ట్ చేశారు?, ఎందుకు వదిలిపెట్టారు?., పోలీసులపై విమర్శలు చేసినందుకు కేసు నమోదు చేశారా.. లేదా?, అందుకే ఆయనను పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారా..?. అసలు పోలీస్ స్టేషన్‌లో ఏం జరిగింది?, శ్రీకాంత్ చేసిన విమర్శలపై ఏం చెప్పారు..?. పోలీసులు ఎందుకు విడిచిపెట్టారు?.’’ అనే ప్రశ్నలు ప్రజల నుంచి వినిపిస్తున్నాయి. పోలీసులు క్లారిటీ ఇస్తే బాగుంటుందని అంటున్నారు.