- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
గుర్తు తెలియని వ్యక్తి మృతి
దిశ, ఊర్కొండ: గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందిన సంఘటన నాగర్ కర్నూల్ జిల్లా ఊర్కొండ మండల శివారులో కల్వకుర్తి జడ్చర్ల ప్రధాన రహదారిపై బందోజి హోటల్ సమీపంలో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. ఎస్సై వీరబాబు తెలిపిన వివరాల ప్రకారం..గుర్తు తెలియని వ్యక్తి నీరసంగా రోడ్డు పక్కన పడి ఉంటాడని, చలి తీవ్రతతోనే మృతి చెంది ఉంటాడని ఎస్ఐ అన్నారు. బుధవారం తెల్లవారుజామున వాహనదారులు మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో సంఘటనస్థలాన్ని చేరుకొని మృతదేహాన్ని కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామన్నారు. ఆసుపత్రి వైద్యులు పరీక్షించి చల్లటి చలితోపాటు..నీరసంగా ఉండటంతోనే మృతి చెంది ఉన్నాడని వైద్యులు పేర్కొన్నారని ఎస్ఐ తెలిపారు. మృతదేహాన్ని మార్చురీలో భద్రపరిచామని గ్రామ పంచాయతీ కార్యదర్శి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై పేర్కొన్నారు. ఆచూకీ తెలిసినవారు ఊర్కొండ పోలీసులను సంప్రదించాలని ఎసై వీరబాబు అన్నారు.