- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
మహా శివరాత్రి జాతర ఘనంగా నిర్వహించాలి
దిశ , మేళ్లచెరువు : శివరాత్రి జాతర ఘనంగా నిర్వహించేందుకు ఇప్పటి నుండే ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర నీటి పారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. బుధవారం మేళ్లచెర్వు శివాలయంలో వచ్చే శివరాత్రి జాతర ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ..నూతన సంవత్సరంలో శివాలయానికి రావటం, దేవుడు ఆశీస్సులు తీసుకోవడం అదృష్టంగా భావిస్తానని, ప్రజలందరికి ఆయురారోగ్యాలు కల్పించాలని కోరుకుంటూ అందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. వచ్చే శివరాత్రి జాతరకి 5-6 లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా శానిటేషన్, త్రాగు నీటి వసతి, పార్కింగ్ లాంటివి భారీగా ఏర్పాట్లు చేయాలన్నారు. దేవాలయ కమిటీ అధికారుల సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు. శివాలయం రాజగోపురం కోసం 55 లక్షలు కేటాయించి పూర్తి చేశామని తెలిపారు.
1994 నుంచి మేళ్లచెర్వు ప్రజలు అత్యంత ఆత్మీయ చూపుతూ 7 సార్లు ఎమ్మెల్యేగా, ఎంపీగా, మంత్రిగా చేసే అవకాశం కల్పించారని, మీ అందరికి రుణ పడి ఉంటానని అన్నారు. మీరందరూ నా కుటుంబ సభ్యులుగా భావిస్తానని, అందుకే మీరు పిలవకపోయిన నూతన సంవత్సరం రోజు ఇక్కడికి వచ్చానని తెలిపారు. ఈ ప్రాంత అభివృద్ధి కి నిరంతరం శ్రమిస్తానని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన సంవత్సరంలోనే మేళ్లచెర్వు చింతలపాలెం మండలాలో వందల కోట్లతో అభివృద్ధి చేసానని, ప్రతి ఎకరానికి సాగు నీరు అందించటమే తన జీవిత లక్ష్యమని అన్నారు. కొత్త లిప్ట్ కొరకు భూసేకరణకి మానవతకోణంలో రైతులు భూములు ఇవ్వాలని వారికి అత్యధిక ధర ప్రభుత్వం నుంచి ఇపిస్తామని అన్నారు. గుండ్లపల్లి లిప్ట్ ఇరిగేషన్ పని చేయటం లేదని రైతులు మంత్రికి తెలపగా..మరమ్మతులు చేసి అందుబాటులోకి తేవాలని ఇరిగేషన్ అధికారులని మంత్రి ఆదేశించారు. హుజూర్ నగర్ నియోజకవర్గంలో డిగ్రీ కాలేజీ నూతన బిల్డింగ్ కోసం 4.15 కోట్లు, ఇంటర్ కాలేజీ నూతన బిల్డింగ్ కొరకు 7.5 కోట్లు, అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ కి 40 కోట్లు, వంద పడకల హాస్పిటల్ లో అదనపు గదులు, సిటి స్కాన్ ఏర్పాటు చేశామని ప్రజలకి ఎక్కడ ఇబ్బంది లేకుండా విద్య, వైద్యం, విద్యుత్, సాగు త్రాగు నీరు అందిస్తున్నమని అన్నారు. ఈ కార్యక్రమం లో ఆర్ డి ఓ శ్రీనివాసులు, తహసీల్దార్ జ్యోతి,దేవాలయం చైర్మన్ శంబీరెడ్డి, ఈ ఓ కొండా రెడ్డి, అధికారులు తదితరులు పాల్గొన్నారు.