- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Davos Summit: దావోస్ సదస్సుకు హాజరుకానున్న సీఎం చంద్రబాబు, నారా లోకేష్
దిశ,వెబ్‌డెస్క్: స్విట్జర్లాండ్(Switzerland)లోని దావోస్‌లో ప్రతి ఏడాది ప్రపంచ ఆర్థిక వాణిజ్య సదస్సు నిర్వహిస్తుండడం తెలిసిందే. ఈ ఏడాదిలో జనవరి 20-24వ తేదీ వరకు దావోస్ సదస్సు జరగనుంది. వరల్డ్ ఎకనామిక్ ఫోరం(World Economic Forum) ఆధ్వర్యంలో ఐదు రోజుల పాటు జరిగే ఈ సదస్సుకు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు హాజరవుతున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు ఏపీ మంత్రులు నారా లోకేష్(Minister Nara Lokesh), కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు(Rammohan Naidu) కూడా ఈ సదస్సులో పాల్గొననున్నారు.
ఏపీలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను అంతర్జాతీయ సంస్థలకు వివరించేందుకు దావోస్ వేదికను(Davos Summit) వినియోగించుకోవాలని సీఎం చంద్రబాబు(CM Chandrababu) అనుకుంటున్నారు. ఇందుకోసం ‘‘షేపింగ్ ద ఇంటెలిజెంట్ ఏజ్’’ థీమ్‌తో ఏపీ బృందం దావోస్‌లో ప్రదర్శన ఏర్పాటు చేయనుంది. దావోస్ పర్యటన కోసం ఏపీ సీఎం బృందం ఈ నెల 19న సీఎం, లోకేష్, పరిశ్రమలు, ఏపీ ఎకనమిక్ డెవలప్‌మెంట్ బోర్డు అధికారులు అక్కడికి బయల్దేరనున్నారు. సాంకేతిక పాలన, రెన్యువబుల్ ఎనర్జీ, స్మార్ట్ సిటీస్, మౌలిక సౌకర్యాల ప్రాజెక్టుల గురించి వివరించనున్నారు. ఇందుకోసం కేంద్రం సదస్సులో ఏపీకి స్టాల్ రిజర్వ్ చేసింది.