AP:రోడ్డు పనుల నాణ్యతలో రాజీ పడకండి.. కాంట్రాక్టర్లకు ఎమ్మెల్యే కీలక సూచన

by Jakkula Mamatha |
AP:రోడ్డు పనుల నాణ్యతలో రాజీ పడకండి.. కాంట్రాక్టర్లకు ఎమ్మెల్యే కీలక సూచన
X

దిశ ప్రతినిధి, అనంతపురం: రోడ్డు పనుల నాణ్యతలో రాజీ లేకుండా పని చేయాలని కాంట్రాక్టర్లకు అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ సూచించారు. అనంతపురం నగరంలోని రాంనగర్ 80 అడుగుల రోడ్డులో జరుగుతున్న రోడ్డు నిర్మాణ పనులను ఆదివారం ఆయన పరిశీలించారు. స్థానిక టీడీపీ నాయకులతో కలిసి ఆయన రోడ్డు వెంబడి మొత్తం పనులు పరిశీలించారు. నాణ్యత విషయంలో రాజీ పడవద్దని ఈ సందర్భంగా ఎమ్మెల్యే సూచించారు. పనులు కూడా త్వరితగతిన పూర్తి చేయాలన్నారు.

వైసీపీ హయాంలో నగరంలో రోడ్లన్నీ అధ్వాన్నంగా ఉండేవని.. టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే రోడ్లకు మహర్దశ వచ్చిందన్నారు. నగరంలో రోడ్లన్నీ మరమ్మతులు చేస్తామని.. నూతన రోడ్లు అవసరమైన చోట ప్రతిపాదనలు పంపుతున్నామని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర నాయకులు గంగారామ్, తెలుగు యువత నాయకుడు నెట్టెం బాలకృష్ణ, టీడీపీ డాక్టర్ సెల్ రాష్ట్ర నాయకులు లక్ష్మీ ప్రసాద్, పంచాయతీ రాజ్ ఛాంబర్ నాయకుడు, మాజీ ఎంపిపి ఇస్మాయిల్, టిడిపి నాయకులు గొనుగుంట్ల అమర్, చెరుకు తోట పవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story