- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
బస్టాండ్ లో ప్రయాణికులకు పూర్తి సౌకర్యాలు కల్పించాలి
దిశ, తిరుమలగిరి : బస్టాండ్ లో ప్రయాణికులకు పూర్తి సౌకర్యాలు కల్పించాలని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు. సికింద్రాబాద్ జూబ్లీ బస్ స్టేషన్ లో తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్,హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ లు బుధవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.ఈ సందర్బంగా మంత్రి జూబ్లీ బస్టాండ్ లో ప్రయాణికులతో ముచ్చటించారు. రోడ్డు భద్రతా మాసంలో భాగంగా డ్రైవర్లతో మాట్లాడి రోడ్డు భద్రత పై అవగాహన కల్పించాలని సంబందిత అధికారులు సూచించారు. అనంతరం బస్ స్టేషన్ లో మూత్రశాలలను పరిశీలించిన మంత్రి శానిటేషన్ విభాగంలో పనిచేసే వారితో మాట్లాడి పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు.
క్యాంటీన్ లో నాణ్యమైన ఆహారం అందించాలని అధికారులను కోరారు. జేబీఎస్ లో ఉన్న కార్గో సెంటర్ ను పరిశీలించి కార్గో పార్సిల్ ల గురించి అడిగి తెలుసుకున్నారు. బస్ స్టేషన్ ప్రాంగణంలోని పలు ఆహార దుకాణాలను పరిశీలించి కాలం చెల్లిన ఆహార వస్తువులు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. శానిటేషన్ విభాగంతో మాట్లాడి ఎప్పటికప్పుడు బస్ స్టేషన్ పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని వారికి సూచించారు. ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా తాగునీటి సరఫరాతో పాటు డిస్ ప్లే బోర్డులు కనిపించే విధంగా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఆయన వెంట కాంగ్రెస్ నాయకులు సంబంధిత డిపో అధికారులు ఉన్నారు.