Amazon: అమెజాన్ కీలక నిర్ణయం.. బెంగళూరు హెడ్​క్వార్టర్స్ తరలింపు..!

by Maddikunta Saikiran |   ( Updated:2024-11-18 11:51:43.0  )
Amazon: అమెజాన్ కీలక నిర్ణయం.. బెంగళూరు హెడ్​క్వార్టర్స్ తరలింపు..!
X

దిశ, వెబ్‌డెస్క్: అమెరికా(USA)కు చెందిన ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజ సంస్థ అమెజాన్(Amazon) కీలక నిర్ణయం తీసుకుంది. బెంగళూరు(Bangalore)లోని వరల్డ్​ ట్రేడ్​ సెంటర్స్(WTC)​ నుంచి తన హెడ్​క్వార్టర్స్​ని వేరొక చోటుకు షిఫ్ట్​ చేయాలని నిశ్చయించుకుంది. గత కొన్ని ఏళ్లుగా ఉంటున్న వాయువ్య బెంగళూరులోని కార్పోరేట్ కార్యాలయాన్ని నగర శివార్లకు మారుస్తోంది. కాస్ట్​ కటింగ్(Cost Cutting)​, ఎయిర్​పోర్ట్(Airport​)కి దగ్గరగా ఉండాలన్న నిర్ణయంతో హెడ్ క్వార్టర్స్ ను మారుస్తున్నట్లు తెలుస్తోంది. కాగా అమెజాన్ ఇండియా ప్రస్తుత కార్యాలయం మల్లేశ్వరంలోని వరల్డ్​ ట్రేడ్​ సెంటర్స్​లో 30 అంతస్తుల భవనంలో దాదాపు 18 అంతస్తులలో అర మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్వహిస్తోంది. ఇందుకోసం ఒక్కో చదరపు అడుగుకు రూ. 250 చొప్పున చెల్లిస్తోంది. అయితే కొత్తగా తీసుకునే భవనంలో అద్దె ఇప్పుడు చెల్లిస్తున్న అద్దె కంటే మూడింట ఒక వంతు కంటే తక్కువే ఉంటుందని భావిస్తున్నారు. ఈ తరలింపు ప్రక్రియ 2025 ఏప్రిల్​లో ప్రారంభమై 2026 ఏప్రిల్ నాటికి పూర్తవుతుందని నివేదిక తెలిపింది. కాగా కంపెనీ తీసుకున్న నిర్ణయంపై ఉద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed