Rajamouli: వైల్డ్‌ఫైర్ స్టార్ట్ అయింది ఇక విధ్వంసమే.. ‘పుష్ప-2’ ట్రైలర్‌పై రాజమౌళి ట్వీట్

by Hamsa |   ( Updated:2024-12-11 06:41:43.0  )
Rajamouli: వైల్డ్‌ఫైర్ స్టార్ట్ అయింది ఇక విధ్వంసమే.. ‘పుష్ప-2’ ట్రైలర్‌పై రాజమౌళి ట్వీట్
X

దిశ, సినిమా: సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ‘పుష్ప-2’(Pushpa-2) గురించే చర్చించుకుంటున్నారు. అంతటా పుష్పగాడి రూల్ నడుస్తోంది. నవంబర్ 17న విడుదలైన ట్రైలర్ ‘పుష్ప-2’ అంచనాలను రెట్టింపు చేసిందనడంలో అతిశయోక్తి లేదు. పాట్నా(Patna)లో జరిగిన ఈ ట్రైలర్(Trailer) ఈవెంట్ ‌కు ఫ్యాన్స్ భారీగా తరలి వెళ్లారు. ప్రజెంట్ పుష్ప-2 ట్రైలర్ సోషల్ మీడియాను షేక్ చేయడంతో పాటు భారీ వ్యూస్‌ను రాబడుతూ దూసుకుపోతుంది.

ఇక దీనిని చూసిన పలువురు సినీ స్టార్స్‌ సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు. తాజాగా, ఈ సినిమా ట్రైలర్ చూసిన దర్శకధీరుడు రాజమౌళి(Rajamouli) ఓ ట్వీట్ చేశారు. ‘‘పాట్నాలో వైల్డ్‌ఫైర్ మొదలైంది. అది దేశవ్యాప్తంగా వ్యాపిస్తుంది. డిసెంబర్ 5(December 5)న విధ్వంసం జరగబోతుంది. పుష్ప పార్టీ కోసం ఈగర్‌గా వెయిన్ చేస్తున్నాను’’ అని రాసుకొచ్చారు. ఈ పోస్ట్ చూసిన అల్లు అర్జున్(Allu Arjun) ‘థాంక్యు పార్టీ కచ్చితంగా ఉంటుంది’’ అని రిప్లై ఇచ్చారు.

Advertisement

Next Story

Most Viewed