Kishan Reddy: అవును నేను గులా‌మ్‌నే.. సీఎం రేవంత్‌కు కిషన్‌రెడ్డి కౌంటర్

by Shiva |   ( Updated:2024-11-18 08:25:26.0  )
Kishan Reddy: అవును నేను గులా‌మ్‌నే.. సీఎం రేవంత్‌కు కిషన్‌రెడ్డి కౌంటర్
X

దిశ, వెబ్‌డెస్క్: మహారాష్ట్ర (Maharashtra) ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి (Kishan Reddy) గుజరాతీలకు గులామ్‌లా మారాడంటూ సీఎం రేవంత్‌‌రెడ్డి (CM Revanth Reddy) కామెంట్ చేశారు. తాజాగా, ఆయన చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి (Union Minister Kishan Reddy) స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. సీఎం రేవంత్‌ (CM Revanth) తనను గుజరాత్ గులామ్ అంటూ విమర్శిస్తున్నారని.. తాను భారతీయులకు మాత్రమే గులా‌మ్‌నని కిషన్‌రెడ్డి అన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ (Sardar Vallabhbhai Patel), మహాత్మా గాంధీ (Mahatma Gandhi), ప్రధాని నరేంద్ర మోడీ (Narendra Modi) పుట్టిన గుజరాత్‌ (Gujarat)కు తాను గులామ్‌నేనని అన్నారు. ఇటలీకీ, నకిలీ గాంధీ కుటుంబానికి తాను గులామ్ కాదని కౌంటర్ ఇచ్చారు. అదానీ పేరు చెప్పి బీజేపీ(BJP)ని విమర్శిస్తున్నారని.. రాష్ట్రంలో పెట్టుబడుల కోసం అదానీ (Adani)తో రేవంత్ చర్చలు జరపలేదా అని ప్రశ్నించారు. రాష్ట్ర సమస్యల మీద తాను ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే.. సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి ఇలా వ్యక్తిగత వివమర్శలకు దిగడం సరికాదని కిషన్‌రెడ్డి అన్నారు.

Next Story

Most Viewed