- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
కలెక్టర్ రాకతో పల్లెకు మెరుగులు.. మండల అధికారుల దోబూచులాట..

దిశ,తల్లాడ : గ్రామాలే పల్లెలు పట్టుగోమ్మలాంటివి అని మహాత్మా గాంధీ అన్నారు. అలాంటి పల్లెలను చెత్త చెదారంతో నింపుతున్నారు ప్రజలు. కానీ అది తొలగించే పని మాత్రం అధికారులకు పట్టి పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. వివరాల్లోకి వెళితే తల్లాడ మండలం లో రామచంద్రపురం గ్రామానికి మా పాప మా ఇంటి మణిదీపం అంటూ జిల్లా కలెక్టర్ ముజామిల్ ఖాన్ కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టే భాగంగా గ్రామానికి వచ్చిన జిల్లా కలెక్టర్ కి భయపడి పల్లెల్లో నీ చెత్తను తొలగించి రోడ్డు ఇరువైపులా ఉన్న గడ్డిని డోజర్ సహాయంతో తొలగించారు.అదే గ్రామంలో అంతకుముందు చెత్త, చేదరం కుప్పలు కుప్పలుగా పేరుకుపోయిన ఎవరూ పట్టించుకోని విధంగా ఉండటం శోచనీయం. గత ప్రభుత్వం పంచాయతీ ట్రాక్టర్లను ఏర్పాటు చేసి పొడి చెత్త తడి చెత్త అని వేరు చేసి వేయాలంటూ ఇంటింటికి తిరిగి చెత్తను సేకరించారు.
అలాంటి ట్రాక్టర్ రిపేర్ వచ్చిందని గత ఆరు నెలల నుంచి తిరగడమే లేదంటూ అలాగే ప్రజలు ఏమి చేయాలని పరిస్థితుల్లో ఉండి చెత్తను రోడ్డు పక్కన పడి వేస్తున్నారు. ఇదేమిటని ప్రజలను అడిగితే ఏం చేయాలి కనీసం ఇంతకుముందు ఇంటి ముందుకు ట్రాక్టర్ వచ్చేది చెత్తను సేకరించేది అలాంటి ట్రాక్టర్ రాకపోవడం చెత్తని ఇంట్లో కుప్పలుగా పేరుకుపోతుంది అలాంటి చెత్తను ఇంట్లోనే ఉంచుకోలేము కదా అందుకే రోడ్డు పక్కన పడి వేస్తున్నామని ప్రజలు అంటున్నారు. కానీ మండల అధికారులు పట్టని ధోరణితో వ్యవహరిస్తూ కనీసం ట్రాక్టర్ ను మరమ్మతులు చేపించి గ్రామాల్లో చెత్తను సేకరించాలని అనే ఆలోచన కూడా చేయకపోవడం ఏంటి అని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.కలెక్టర్ వస్తే తప్ప గ్రామంలో పంచాయతీ సిబ్బంది చెత్తని తొలగించరా అంతకు ముందు చెత్తని ఎందుకు తొలగించ లేదు అని ప్రజలు అధికారులను ప్రశ్నిస్తున్నారు.