- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
100 కోట్ల హీరోయిన్ తో విజయ్ దేవరకొండ సినిమా?

దిశ, వెబ్ డెస్క్ : టాలీవుడ్ ఇండస్ట్రీలో విజయ్ దేవరకొండకు ( Vijay Dewarakonda) మంచి క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే. వరుసగా సినిమాలు ఫ్లాఫ్ అవుతున్న విజయ్ దేవరకొండ క్రేజ్ ఏ మాత్రం తగ్గడం లేదు. దర్శక నిర్మాతలు విజయ్ దేవరకొండ తో సినిమాలు తీసేందుకు... నిత్యం రెడీ గానే ఉంటున్నారు. ఇక ఈ నేపథ్యంలోనే... విజయ్ దేవరకొండ హీరోగా "రౌడీ జనార్దన్ " ( Rowdy Janardhan ) సినిమా వస్తోంది. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. రవికిరణ్ కోలా ( Ravikiran Kola), రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ ( Vijay Dewarakonda) కాంబినేషన్ లో ఈ సినిమా తెరకెక్కుతోంది.
ఈ సినిమా కోసం దాదాపు 5 హీరోయిన్లను సంప్రదించారట. కానీ ఒక్క హీరోయిన్ కూడా ఫైనల్ కాలేనని సమాచారం. అయితే కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్ ( Rukmini Vasant ) పేరును ఫైనల్ చేసినట్లు మొన్నటి వరకు జోరుగా ప్రచారం జరిగింది. కానీ చివరి క్షణంలో ఆమె కూడా ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకుందట. ఈ తరుణంలోనే... బాలీవుడ్ ఇండస్ట్రీలో 100 కోట్ల రేంజ్ లో సినిమాలు తీస్తున్న కీర్తి సురేష్ ను ( Keerthy Suresh) చిత్ర బృందం సంప్రదించిందట. విజయ్ దేవరకొండ తో... సినిమా చేయాలని... కోరినట్లు తెలుస్తోంది. రెమ్యూనరేషన్ కూడా కీర్తి సురేష్ అడిగినంత ఇచ్చేందుకు సిద్ధమయ్యారట. ఈ సినిమా మొత్తం గోదావరి మాండలికంలో.. ఉండే అవకాశాలు ఉన్నట్టు చెబుతున్నారు. అయితే ఈ సినిమాకు కీర్తి సురేష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందా? లేదా అనేది తెలియాల్సి ఉంది.
Read More..
స్టైలీష్ లుక్‌లో దర్శనమిచ్చిన స్టార్ హీరోయిన్.. నిన్నిలా చూస్తే దెబ్బకు అతను ప్లాట్ అంటూ కామెంట్స్