TG Assembly: అసెంబ్లీలో వాయిదా తీర్మానాల పర్వం.. ఆ అంశాలపై చర్చకు విపక్షాల పట్టు

by Shiva |
TG Assembly: అసెంబ్లీలో వాయిదా తీర్మానాల పర్వం.. ఆ అంశాలపై చర్చకు విపక్షాల పట్టు
X

దిశ, వెబ్‌డెస్క్: అసెంబ్లీ (Assembly) సమావేశాల్లో భాగంగా చివరి రోజు బీఆర్ఎస్, బీజేపీ, సీపీఐలు పలు అంశాలపై వాయిదా తీర్మానాలు అందజేశాయి. అయితే, ఇప్పటికే అసెంబ్లీ (Assembly)తో శాసన మండలి (Legislative Council)లో ప్రశ్నోత్తరాలను రద్దు చేస్తున్నట్లుగా సభాపతులు ప్రకటించారు. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ పార్టీ (BRS Party) ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్ డీఏలు చెల్లించాలని, పీఆర్సీ వెంటనే అమలు చేయాలని వాయిదా తీర్మానం ఇచ్చింది. అదేవిధంగా బీజేపీ (BJP) తెలంగాణ (Telangana)లో కొత్త జోన్లు, కొత్త జిల్లాలకు అనుగుణంగా ఉద్యోగుల సర్దుబాటు కోసం ఉద్దేశించిన జీఓ నెం.317పై చర్చకు పట్టబడుతూ.. వాయిదా తీర్మానం సమర్పించింది. మరోవైపు సీపీఐ (CPI) రాష్ట్ర వ్యాప్తంగా దళితులు గుడిసెలు వేసుకున్న స్థలాలను వారికే కేటాయించాలని కోరుతూ.. స్పీకర్ కార్యాలయంలో వాయిదా తీర్మానం అందజేసింది.

చివరి రోజు అసెంబ్లీ సమావేశాలు (Assembly Sessions) కాసేపటి క్రితం ప్రారంభమయ్యాయి. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ (Speaker Gaddam Prasad Kumar) అనుమతితో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క (Deputy CM Mallu Bhatti Vikramarka) సభలో కాగ్ (Comptroller and Auditor General of India) రిపోర్టును ప్రవేశ పెట్టనున్నారు. ఆ రిపోర్టుపై చర్చ ముగిసిన వెంటనే కేంద్ర ప్రభుత్వం (Central Government) తీసుకురాబోతున్న లోక్‌సభ నియోజకవర్గాల డీలిమిటేషన్‌ (Delimitation)పై వ్యతిరేకంగా అసెంబ్లీ (Assembly)లో తీర్మానం ప్రవేశపట్టనున్నారు. అనంతరం ద్రవ్య వినిమయ బిల్లు (Currency Exchange Bill), అవయవ దానం బిల్లు (Organ Donation Bill)లకు కూడా ఆమోదం తెలుపనున్నారు.

Next Story

Most Viewed