Job Alert:నిరుద్యోగులకు బిగ్ అలర్ట్.. 1,161 ఉద్యోగాలకు రేపే లాస్ట్ డేట్

by Jakkula Mamatha |
Job Alert:నిరుద్యోగులకు బిగ్ అలర్ట్.. 1,161 ఉద్యోగాలకు రేపే లాస్ట్ డేట్
X

దిశ,వెబ్‌డెస్క్: పదో తరగతి పాసై ఖాళీగా ఉంటున్న నిరుద్యోగ అభ్యర్థులకు బిగ్ అలర్ట్. CISF లో పలు ఉద్యోగాలకు ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ పోస్టుల దరఖాస్తు ప్రక్రియ గడువు రేపటితో(ఏప్రిల్ 3వ తేదీ) ముగియనుంది. ఈ నేపథ్యంలో సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్(CISF)లో 1,161 కానిస్టేబుల్ ట్రేడ్స్‌మెన్ పోస్టులకు అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు వెంటనే అప్లై చేసుకోవాలి.

కానిస్టేబుల్/ ట్రేడ్స్‌మెన్ పోస్టులకు మెట్రిక్యులేషన్ కలిగిన 18-23 ఏళ్ల అభ్యర్థులు అర్హులు. PET, PST, డాక్యుమెంట్ వెరిఫికేషన్, రాత పరీక్ష, ట్రేడ్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అన్‌రిజర్వ్‌డ్, OBC, EWS అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు రూ.100 కాగా SC, STలకు ఎటువంటి దరఖాస్తు చెల్లించాల్సిన అవసరం లేదు. జీతం నెలకు రూ.21,700 నుంచి రూ.69,100 వరకు ఇస్తారు. పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్ సైట్ cisfrectt.cisf.gov.in సందర్శించండి.


👉 Follow us on WhatsApp Channel
👉 Follow us on Sharechat


Next Story