- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
‘జాట్’ సినిమాలో ఐటెం సాంగ్ చేయడానికి రెడీ అయిన యంగ్ బ్యూటీ.. ఇప్పుడు అవసరమా అంటున్న నెటిజన్లు

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని(Gopichand Malineni), బాలీవుడ్ సూపర్ స్టార్ సన్నీ డియోల్(Sunny Deol) కాంబోలో రాబోతున్న లేటెస్ట్ మూవీ ‘జాట్’(JAAT). పవర్ ఫుల్ యాక్షన్ ప్యాక్‌డ్ మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాను తెలుగు అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని(Naveen Yerneni), వై రవిశంకర్(Ravi Shankar) నిర్మిస్తున్నారు. అయితే పలు హిట్ మూవీస్ తెరకెక్కించిన దర్శకుడు రూపొందిస్తుండటంతో అంచనాలు భారీగా పెరిగిపోయాయి.
ఈ చిత్రానికి ఎస్ తమన్(Thaman) బ్యాగ్రౌండ్ స్కోర్ అందిస్తుండగా.. ఇందులో వినీత్ కుమార్ సింగ్, సయామి ఖేర్, రెజీనా కసాండ్రా కీలక పాత్రలో కనిపించనున్నారు. షూటింగ్ శరవేగంగా జరుగుతున్న ఈ మూవీ ఏప్రిల్ 10న గ్రాండ్‌గా థియేటర్స్‌లో విడుదల కానుంది. ఇక ఇప్పటికే ‘జాట్’ నుంచి విడుదలైన పోస్టర్స్, టీజర్ అందరిలో క్యూరియాసిటీని పెంచాయి. కాగా ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు రణ్‌దీప్ హుడా(Randeep Hooda) ఓ పవర్ ఫుల్ క్యారెక్టర్‌లో నటిస్తున్న సంగతి తెలిసిందే.
ఇదిలా ఉంటే.. తాజాగా ఈ మూవీలో స్పెషల్ సాంగ్‌లో అలరించడానికి యంగ్ బ్యూటీ నభా నటేష్(Nabha Natesh) ఫిక్స్ అయినట్లు ఓ న్యూస్ సోషల్ మీడియాలో కోడై కూస్తోంది. హైదరాబాద్(Hyderabad)లో ప్రత్యేకంగా సిద్ధం చేసిన భారీ సెట్‌లో ఈరోజు నుంచే ఈ సాంగ్ షూటింగ్ స్టార్ట్ కానున్నట్లు తెలుస్తోంది. మరి ఇందులో నిజమెంతుందో తెలియనప్పటికీ ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింట వైరల్‌గా మారింది. ఇక ఈ న్యూస్ విన్న నెటిజన్లు హీరోయిన్‌గా రాణిస్తున్న టైంలో ఐటెం సాంగ్స్ అవసరమా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Read More..
అలాంటి ఫొటో షూట్ చేసిన యాంకర్.. పెళ్లి అయ్యాక కూడా ఇలాంటివి అవసరం అంటారా అధ్యక్షా అంటూ మీమ్స్